కరెంటు అఫైర్స్ Quiz RRB NTPC Group D Telugu MCQs | 16 - 05 - 2019

 • 1. స్టాన్‌ఫర్డ్ స్టడీ ప్రచురించిన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ ఆకాడమీ ఆఫ్ సెన్సైస్’ జర్నల్‌లో భూతాపం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోయింది?
   A.) 31%
   B.) 25%
   C.) 50%
   D.) 30%

Answer: Option 'A'

31%

 • 2. భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ మూలధనాన్ని రూ. 8వేల కోట్లకు పెంచింది?
   A.) బ్యాంక్ ఆఫ్ బరోడా
   B.) అలహాబాద్ బ్యాంక్
   C.) భారతీయ స్టేట్ బ్యాంక్
   D.) కెనరా బ్యాంక్

Answer: Option 'B'

అలహాబాద్ బ్యాంక్

 • 3. వ్యాపారాలను సైబర్ దాడుల వల్ల ఆర్థిక, ప్రతిష్ట నష్టాల నుంచి రక్షించడానికి ‘సైబర్ డిఫెన్స్ ఇన్సూరెన్స్’ను ప్రారంభించిన బీమా కంపెనీ?
   A.) హెచ్‌డీఎఫ్‌సీ జనరల్ ఇన్సూరెన్స్
   B.) ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్
   C.) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
   D.) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్

Answer: Option 'B'

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్

 • 4. ఐదు టీ సాగు, వినియోగ దేశాల సమాఖ్య- ఏషియన్ టీ అలయెన్స్(ఏటీఏ) ఎక్కడ ప్రారంభమైంది?
   A.) గ్వీర, చైనా
   B.) డార్జిలింగ్, భారత్
   C.) కొలంబో, శ్రీలంక
   D.) జకార్తా, ఇండోనేషియా

Answer: Option 'A'

గ్వీర, చైనా

 • 5. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ప్రకారం 2019 సంవత్సరానికి జీవిత బీమా ప్రీమియం ఆదాయం ఎంత శాతం పెరిగింది?
   A.) 15%
   B.) 14%
   C.) 11%
   D.) 13%

Answer: Option 'C'

11%

 • 6. 12వ ఆస్తానా ఎకనమిక్ ఫోరం 2019లో పాల్గొననున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ?
   A.) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
   B.) జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
   C.) న్యూ ఇండియా అష్యూరెన్స్
   D.) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్

Answer: Option 'B'

జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్

 • 7. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామాయణ ఇతివృత్తం నేపథ్యంతో తపాలా బిళ్ల్లను విడుదల చేసిన దేశం?
   A.) శ్రీలంక
   B.) భూటాన్
   C.) ఇండోనేషియా
   D.) నేపాల్

Answer: Option 'C'

ఇండోనేషియా

 • 8. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానిమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ), ఏ నోబెల్ గ్రహీత గౌరవార్థం ఇనిక్వాలిటీ స్టడీస్‌లో చైర్‌ని(చైర్మన్ పదవి) సృష్టించింది?
   A.) కైలాష్ సత్యార్థి
   B.) పాల్ రోమర్
   C.) అమర్త్యసేన్
   D.) గ్రిగరీ వింటర్

Answer: Option 'C'

అమర్త్యసేన్

 • 9. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్‌నెస్(ఐసీపీ) 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
   A.) ఇజ్రాయిల్
   B.) జర్మనీ
   C.) ఆస్ట్రేలియా
   D.) డెన్మార్క్

Answer: Option 'C'

ఆస్ట్రేలియా

 • 10. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019’లో 2018కి గాను అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
   A.) ఫిన్లాండ్
   B.) ఇజ్రాయిల్
   C.) అమెరికా
   D.) భారత్

Answer: Option 'C'

అమెరికా

 • 11. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ- 2019లో భారత ర్యాంక్?
   A.) 150
   B.) 145
   C.) 140
   D.) 138

Answer: Option 'C'

140

 • 12. అబుదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఏడీఐబీఎఫ్) 29వ ఎడిషన్‌లో ఆవిష్కరించిన జలియన్ వాలాబాగ్ మారణకాండపై రచించిన ‘ఖూనీ బైసాకీ’కి ఆంగ్ల అనువాదం పేరు?
   A.) ‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’
   B.) ‘మెన్ అట్ ఆర్మ్స్’
   C.) ‘వార్ అండ్ పీస్’
   D.) ‘ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’

Answer: Option 'A'

‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’

 • 13. భారత వాయుసేన ఇటీవల ఎవరి పేరును ‘వీరచక్ర’ పతకానికి సిఫార్సు చేసింది?
   A.) ప్రదీప్ పద్మాకర్ బాపత్
   B.) అనిల్ ఖోస్లా
   C.) అభినందన్ వర్థమాన్
   D.) బిరేంద్ర సింగ్ ధనోవా

Answer: Option 'C'

అభినందన్ వర్థమాన్

 • 14. సిగ్నల్ అండ్ టెలీకాం డిపార్ట్‌మెంట్, రైల్వే బోర్డు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
   A.) హరీశ్ పిళ్లై
   B.) సందీప్ పాటక్
   C.) ఎన్. కాశీనాథ్
   D.) సంతోష్ కుమార్

Answer: Option 'C'

ఎన్. కాశీనాథ్

 • 15. భారత రాజ్యాంగానికి ‘సంవిధాన్ కావ్య’ రచనతో కావ్యరూపమిచ్చిన ఎవరికి ‘పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు’ లభించింది?
   A.) లాల్ బహదూర్ శాస్త్రి
   B.) సునీల్ కుమార్ గౌతమ్
   C.) సంపూర్ణానంద
   D.) కైలాష్ నాథ్ కట్జూ

Answer: Option 'B'

సునీల్ కుమార్ గౌతమ్

 • 16. నిర్భయ ఫండ్ కింద అమలుచేసిన ‘అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్ - 112’ పాన్-ఇండియా నెట్‌వర్క్‌లో లేని రాష్ట్రం?
   A.) కేరళ
   B.) కర్ణాటక
   C.) తమిళనాడు
   D.) అరుణాచల్ ప్రదేశ్

Answer: Option 'D'

అరుణాచల్ ప్రదేశ్

 • 17. అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఓ) నివేదిక - ‘ది సేఫ్టీ అండ్ ది హెల్త్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ బిల్డింగ్ ఆన్ 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియెన్స్’లో చేర్చిన భారత దుర్ఘటన?
   A.) భోపాల్ విషవాయువు దుర్ఘటన
   B.) తమిళనాడులోని చెన్నై వరదలు
   C.) ఆంధ్రప్రదేశ్ వడగాడ్పులు
   D.) గుజరాత్ భూకంపం

Answer: Option 'A'

భోపాల్ విషవాయువు దుర్ఘటన

 • 18. అరబ్ దేశాల్లో తొలిసారి జరగనున్న జీ 20 సదస్సు - 2020 15వ ఎడిషన్‌కు వేదిక కానున్న నగరం?
   A.) జెడ్డా, సౌదీ అరేబియా
   B.) రియాద్, సౌదీ అరేబియా
   C.) మస్కట్, ఒమన్
   D.) దుబాయ్, యూఏఈ

Answer: Option 'B'

రియాద్, సౌదీ అరేబియా

 • 19. అమెరికాలోని వర్జీనియాలో సిగ్నస్‌ఎన్జీ11 ద్వారా ప్రయోగించిన తొలి నేపాల్ ఉపగ్రహం?
   A.) నేపాలీశాట్-1
   B.) నేపాలీకామ్-1
   C.) నేపాలీక్యూఏఎఫ్-1
   D.) నేపాలీక్యూబ్-1

Answer: Option 'A'

నేపాలీశాట్-1

 • 20. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్‌నెస్(ఐసీపీ) 2019 లో భారత్ ర్యాంక్?
   A.) 23
   B.) 26
   C.) 22
   D.) 19

Answer: Option 'D'

19