వ్యవసాయం అనుబంధ రంగాలు -Agriculture and Allied Activities - AP Socio-Economic Survey 2018 - 2019

1.

ఆంధ్రప్రదేశ్ సాంవత్సరిక సాధారణ వర్షపాతం 

   A.) 966 మి.మీ
   B.) 869 మి.మీ
   C.) 946 మి.మీ
   D.) 696 మి.మీ 

Answer: Option 'A'

966 మి.మీ

2.

రైతుల ఆర్ధిక భారాన్ని తగ్గించుటకు వడ్డీలేని పంట రుణాలు, వడ్డీకి రుణాలు అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం 

   A.) రైతు శ్రీ 
   B.) రైతు బంధు 
   C.) రైతు నేస్తం 
   D.) రైతు మిత్ర  

Answer: Option 'A'

రైతు శ్రీ 

3.

వివిధ పథకాలకు సంబంధించిన సాంకేతిక సమాచారం, లక్ష్యాలు, మార్గదర్శకాలు, సబ్సిడీలు సూచనలతో ప్రతి నెల వ్యవసాయ శాఖ వారు విడుదల చేసే మాసపత్రిక 

   A.) రైతు మిత్ర 
   B.) రైతేరాజు
   C.) పాడిపంటలు
   D.) అన్నదాత

Answer: Option 'C'

పాడిపంటలు

4.

2018 - 2019 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి లో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట

   A.) జొన్న
   B.) మొక్క జొన్న 
   C.) పప్పు ధాన్యాలు 
   D.) చిరు ధాన్యాలు 

Answer: Option 'B'

మొక్క జొన్న 

5.

2018 - 2019 ఏపీ సామాజిక ఆర్ధిక సర్వే ప్రకారం నవరత్నాలు అమలులో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో లేనిదీ 
ఎ) రూ. 3000 కోట్ల కార్పస్ ఫండ్ తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు 
బి) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం 
సి) రైతు బీమా కింద పంటల బీమా ప్రీమియం ను ప్రభుత్వమే చెల్లించుట 
డి) రోజులో రాత్రి, పగలు కలిపి 9 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తారు.

   A.) ఎ & బి
   B.) బి మాత్రమే 
   C.) బి & డి
   D.) డి మాత్రమే

Answer: Option 'D'

డి మాత్రమే

6.

వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా 

   A.) వైఎస్సార్ కడప 
   B.) విశాఖపట్నం
   C.) కృష్ణా
   D.) నెల్లూరు

Answer: Option 'D'

నెల్లూరు

7.

రాష్ట్రం లో అటవీ విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)

   A.) 37.66
   B.) 36.88
   C.) 35.86
   D.) 34.67

Answer: Option 'B'

36.88

8.

భూ కమతాల వివరాలు (వ్యవసాయ గణాంకాలు) ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు.

   A.) ప్రతి 10 సంవత్సరాలకు 
   B.) ప్రతి 3 సంవత్సరాలకు 
   C.) ప్రతి 5 సంవత్సరాలకు 
   D.) ప్రతి 4 సంవత్సరాలకు 

Answer: Option 'C'

ప్రతి 5 సంవత్సరాలకు 

9.

2018 - 2019 లో నైరుతి రుతు పవనాల వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం పొందిన జిల్లా 

   A.) శ్రీకాకుళం
   B.) తూర్పు గోదావరి 
   C.) విజయనగరం
   D.) పశ్చిమ గోదావరి

Answer: Option 'D'

పశ్చిమ గోదావరి

10.

10 వ భూ కమతాల గణాంకాల  ప్రకారం రాష్ట్రం లో ఉపాంత కమతాల సంఖ్య

   A.) 16.46 లక్షలు 
   B.) 25.24 లక్షలు 
   C.) 49.05 లక్షలు 
   D.) 59.04 లక్షలు 

Answer: Option 'D'

59.04 లక్షలు 

11.

రాష్ట్రంలో భూసార నమూనాలను విశ్లేషణ చేస్తే 35% - 40% నేలలు దీని లోపంతో ఉన్నవని తెలుస్తుంది.

   A.) ఐరన్ (Iron) 
   B.) బోరాన్ (Boron) 
   C.) జింక్ (Zink) 
   D.) సల్ఫర్ (Sulphur) 

Answer: Option 'C'

జింక్ (Zink) 

12.

నికర పంట విస్తీర్ణానికి, స్థూలపంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తి ని తెలిపేది

   A.) పంటల తీవ్రత (Cropping Intensity)
   B.) పంట విరామం (Crop Holiday)
   C.) నీటి సాంద్రత (Irrigation Intensity)
   D.) పంట వైవిధ్యత (Crop Diversification)

Answer: Option 'A'

పంటల తీవ్రత (Cropping Intensity)

13.

2017 - 2018 లో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం మొత్తం 42.06 లక్షల హెక్టార్లు ఉండగా 2018 - 2019 లో ఎంత ఉంది?

   A.) 44.83 LH 
   B.) 39.25 LH
   C.) 40.26 LH  
   D.) 41.78 LH

Answer: Option 'C'

40.26 LH  

14.

వైఎస్సార్ బీమా క్రింద రైతు ప్రమాద వశాత్తు మరణించినా లేదా ఆత్మహత్యల మరణించినా బాధిత కుటుంబానికి అందించే సహాయం 

   A.) 5 లక్షలు 
   B.) 7 లక్షలు 
   C.) 3 లక్షలు 
   D.) 6 లక్షలు 

Answer: Option 'B'

7 లక్షలు 

15.

2017 - 2018 లో 1.26 గా ఉన్న పంటల తీవ్రత (Cropping Intensity) 2018 - 2019 లో ఎంత నమోదైనది.

   A.) 1.56
   B.) 1.80
   C.) 1.24
   D.) 1.15

Answer: Option 'C'

1.24

16.

2018 - 2019 లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ వున్నా జిల్లాలు వరుసగా 

   A.) చిన్న కమతాలు  
   B.) ఉపాంత కమతాలు 
   C.) పెద్ద/భారీ కమతాలు
   D.) మధ్య తరహా కమతాలు 

Answer: Option 'B'

ఉపాంత కమతాలు 

17.

అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా 

   A.) YSR కడప  
   B.) తూర్పు గోదావరి  
   C.) చిత్తూరు
   D.) ప్రకాశం

Answer: Option 'A'

YSR కడప  

18.

2019 అక్టోబర్ 15 నుంచి అమలుపర్చనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూ. 12,500/- లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి అందించే సహాయం 

   A.) కేంద్రం రూ.6,000/- రాష్ట్ర ప్రభుత్వం 6,500/-
   B.) కేంద్రం రూ.6,500/- రాష్ట్ర ప్రభుత్వం 6,000/-
   C.) కేంద్రం రూ.5,000/- రాష్ట్ర ప్రభుత్వం 7,500/-
   D.) కేంద్రం రూ.7,000/- రాష్ట్ర ప్రభుత్వం 5,500/-

Answer: Option 'A'

కేంద్రం రూ.6,000/- రాష్ట్ర ప్రభుత్వం 6,500/-

19.

2018 - 2019 సంవత్సరంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం లోటు నమోదైనది 

   A.) 14 శాతం 
   B.) 34 శాతం 
   C.) 18 శాతం 
   D.) 58 శాతం 

Answer: Option 'B'

34 శాతం 

20.

2010 - 2011 లో (9 వ సెన్సెస్) రాష్ట్ర సగటు కామతా పరిమాణం 1.06 హెక్టార్లు కాగా 2015 - 2016 (10 సెన్సెస్) నాటికి సగటు కమతా పరిమాణం 

   A.) 1.52 హెక్టార్ల కు పెరిగింది 
   B.) 0.85 హెక్టార్ల కు తగ్గినది 
   C.) 0.94 హెక్టార్ల కు తగ్గినది 
   D.) 1.26 హెక్టార్ల కు పెరిగింది 

Answer: Option 'C'

0.94 హెక్టార్ల కు తగ్గినది 


వ్యవసాయం అనుబంధ రంగాలు Download Pdf