ఆంధ్రప్రదేశ్ విభజన - Andhra Pradesh Bifurcation Mcqs in Telugu for AP Grama Sachivalayam Exams

1.

ఏ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు ?

   A.) ఫిబ్రవరి 1, 2014
   B.) మార్చి 1, 2014
   C.) జూన్‌ 1, 2014
   D.) మే 1, 2014

Answer: Option 'B'

మార్చి 1, 2014

2.

ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల విద్యుత్‌ను రెండు రాష్ట్రాల మధ్య ఈ విధంగా పంచుకుంటారు ?

   A.) గత ఆరేళ్లలో సంబంధిత రాష్ట్రం డిస్కంల యుదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా
   B.) గత పదేళ్లలో సంబంధిత రాష్ట్రపు డిస్కంల యదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా
   C.) సంబంధిత రాష్ట్రంలో కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రం స్థానం ఆధారంగా
   D.) గత మూడు ఏళ్లల్లో సంబంధిత రాష్ట్రపు డిస్కంల యదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా

Answer: Option 'A'

గత ఆరేళ్లలో సంబంధిత రాష్ట్రం డిస్కంల యుదార్థ విద్యుత్‌ వాడకం ఆధారంగా

3.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఐదో అధికరణాన్ని అనుసరించి, హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల మేరకు ఉమ్మడి రాజధానిగా మెలుగుతుందో ఈ కిందివానిలో గుర్తించగలరు ?

   A.) పది సంవత్సరాలు
   B.) పది సంవత్సరాలు మించకుండా
   C.) పది సంవత్సరాలు దాటి
   D.) పైవేవీ కావు

Answer: Option 'B'

పది సంవత్సరాలు మించకుండా

4.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే పన్ను రాబడి ?

   A.) 50 : 50 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ మధ్య విభజింపబడుతుంది
   B.) 30 : 70 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ మధ్య విభజింపబడుతుంది
   C.) 20 : 80 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణల మధ్య విభజింపబడుతుంది
   D.) ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వబడదు

Answer: Option 'D'

ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వబడదు

5.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఉమ్మడి రాజధాని కింద నోటిఫైడ్‌ ప్రాంతం ఉంటుంది ?

   A.) హెచ్‌ఎండీఎ
   B.) జిహెచ్‌ఎంసి
   C.) హైదరాబాద్‌ జిల్లా 
   D.) హైదరాబాద్‌ మరియు రంగారెడ్డి జిల్లా

Answer: Option 'B'

జిహెచ్‌ఎంసి

ఆంధ్రప్రదేశ్ విభజన - Andhra Pradesh Bifurcation Download Pdf