జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 1

1.

కిందివాటిలో ‘బ్యాక్టీరియల్ పెస్టిసైడ్’ ఏది?

   A.) బాసిల్లస్ ఆంథ్రాసిస్
   B.) బాసిల్లస్ ఫాలిమిక్సా
   C.) క్లాస్ట్రీడియం బొట్సులినమ్
   D.) బాసిల్లస్ థురింజియాన్సిస్

Answer: Option 'D'

బాసిల్లస్ థురింజియాన్సిస్

2.

కణజాలవర్ధనంలో యానకం pH విలువ ఏ విధంగా ఉండాలి?

   A.) 3.0 - 5.0   
   B.) 7.2 - 8.0 
   C.) 5.6-  6.0 
   D.) 6.3 - 7.4 

Answer: Option 'C'

5.6-  6.0 

3.

బెరిబెరి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? 

   A.)
   B.) D
   C.) B1 
   D.) B5

Answer: Option 'C'

B1 

4.

జతపరచండి. 
  జాబితా  I

  a) బయోఇన్ఫర్మేటిక్స్
  b) బయోరె మిడియేషన్
  c) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
  d) జన్యు థెరపీ  
  జాబితా  II 
  i) సూక్ష్మజీవులను ఉపయోగించికాలుష్యాన్ని తొలగించడం
  ii) నేరస్థులను, వ్యక్తి అసలైన తల్లిదండ్రులను గుర్తించడం
  iii) జన్యు సంబంధ వ్యాధుల నిర్ధారణ
  iv) జీవశాస్త్ర అధ్యయనానికి తోడ్పడే సమాచార సాంకేతిక శాస్త్రం

   A.) a)i, b)ii, c)iii, d)iv
   B.) a)iv, b)i, c)ii, d)iii
   C.) a)iv, b)ii, c)i, d)iii
   D.) a)iv, b)i, c)iii, d)ii

Answer: Option 'B'

a)iv, b)i, c)ii, d)iii

5.

మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైమ్‌లు వరసగా? 

   A.) పపేన్, రెన్నెట్
   B.) పపేన్, ప్రోటియేజ్
   C.) ప్రోటియేజ్, ట్రిప్సిన్
   D.) రెన్నెట్, లైపేజ్

Answer: Option 'B'

పపేన్, ప్రోటియేజ్

6.

ఇంటర్‌ఫెరాన్లను కనుగొన్నవారు?

   A.) గిల్‌బర్‌‌ట, వీస్‌మన్
   B.) నాథన్స్ 
   C.) థామ్సన్
   D.) కోహ్లర్, మిల్‌స్టీన్

Answer: Option 'A'

గిల్‌బర్‌‌ట, వీస్‌మన్

7.

సూక్ష్మజీవులను ఉపయోగించి.. నేల లేదా నీటి నుంచి అనవసర వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలను తొలగించే పద్ధతిని ఏమంటారు?

   A.) బయోఇన్ఫర్మేటిక్స్ 
   B.) ప్రోటియోమిక్స్
   C.) బయోరెమిడియేషన్  
   D.) జీనోమిక్స్ 

Answer: Option 'C'

బయోరెమిడియేషన్  

8.

జతపరచండి?  
  జాబితా-1(మొక్క)
  ఎ) బంగాళాదుంప
  బి) క్యారెట్
  సి) ఆపిల్ 
  డి) కాబేజీ
  జాబితా-2(తిన యోగ్యమైన భాగం)
  i) ఉబ్బిన పుష్పాసనం
  ii) శాఖీయ మొగ్గ
  iii) రూపాంతరం చెందిన వేరు
  iv) రూపాంతరం చెందిన కాండం

   A.) ఎ-iv, బి-iii, సి- i, డి- ii
   B.) ఎ-iii, బి-ii, సి- i, డి- iv
   C.) ఎ-ii, బి-i, సి- iv, డి- iii
   D.) ఎ-ii, బి-iv, సి- i, డి- iii

Answer: Option 'A'

ఎ-iv, బి-iii, సి- i, డి- ii

9.

‘గోల్డెన్ రైస్’ను ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు?

   A.) వరిలోని పూసా రకాన్ని IR-8 రకంతో సంకరణం చేయడం ద్వారా
   B.) తైపేయి అనే వరి రకంలో ‘విటమిన్-ఎ’ను ఉత్పత్తి చేసే మూడు జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
   C.) అధిక దిగుబడిని సాధించడానికి వరిలోని ‘అనామిక’ రకంలోకి జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
   D.) వరిలోని ‘బీరాజ్’ రకంలో ఉత్పరివర్తనాలను కలిగించడం ద్వారా

Answer: Option 'B'

తైపేయి అనే వరి రకంలో ‘విటమిన్-ఎ’ను ఉత్పత్తి చేసే మూడు జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా

10.

‘కణజాలవర్ధన పితామహుడు’ ఎవరు?

   A.) ఎఫ్.సి. స్టీవార్‌‌డ 
   B.) మోర్గాన్
   C.) హేబర్ లాండ్ 
   D.) ముల్లర్

Answer: Option 'C'

హేబర్ లాండ్ 

11.

జతపరచండి? 
  జాబితా-1

  ఎ) మైకాలజీ 
  బి) పేలినాలజీ
  సి) అంకాలజీ 
  డి) పేలియాంటాలజీ
  జాబితా-2
  i) పరాగ రేణువుల అధ్యయనం 
  ii) క్యాన్సర్‌కి సంబంధించినది
  iii) శిలాజాల గురించి అధ్యయనం
  iv) శిలీంధ్రాల గురించి అధ్యయనం

   A.) ఎ-iii, బి-ii, సి- i, డి- iv
   B.) ఎ-ii, బి-iii, సి- iv, డి- i
   C.) ఎ-iv, బి-i, సి- ii, డి- iii
   D.) ఎ-i, బి-ii, సి- iv, డి- iii

Answer: Option 'C'

ఎ-iv, బి-i, సి- ii, డి- iii

12.

తొలిసారిగా ‘టోటిపొటెన్సీ’ అనే పదాన్ని ఉపయోగించినవారు?

   A.) మోర్గాన్ 
   B.) స్టీవార్‌‌డ
   C.) ముల్లర్ 
   D.) హేబర్ లాండ్

Answer: Option 'A'

మోర్గాన్ 

13.

జతపరచండి.
  జాబితా  I

  a) సోడియం హైపోక్లోరైట్
  b) మెర్క్యురిక్ క్లోరైడ్ 
  c) సోడియం ఆల్జినేట్
  d) సాయిల్ రైట్ 
  జాబితా  II
  i) విత్తనాల ఉపరితలాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం
  ii) వర్ధనం చేసిన మొక్కలను నాటడం
  iii) ఎక్స్‌ప్లాంట్‌ను సూక్ష్మజీవరహితం చేయడం
  iv) పిండాలను గుళికలుగా మార్చడం

   A.) a.iii b.i c.iv d.ii
   B.) a.iii b.ii c.iv d.i
   C.) a.ii b.i c.iv d.iii
   D.) a.iii b.i c.ii d.iv

Answer: Option 'A'

a.iii b.i c.iv d.ii
 

14.

‘ఇంటర్‌ఫెరాన్’లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి?

   A.) అకశేరుకాలు 
   B.) సకశేరుకాలు
   C.) బ్యాక్టీరియాలు 
   D.) శిలీంధ్రాలు

Answer: Option 'B'

సకశేరుకాలు

15.

‘సోడియం ఆల్జినేట్’తో రక్షణ కవచాలను ఏర్పర్చి, గుళికలుగా మార్చే నిర్మాణాలను ఏమంటారు?   

   A.) ప్లాస్మిడ్‌లు 
   B.) ప్లాస్టిడ్‌లు
   C.) సంశ్లేషిత/ కృత్రిమ విత్తనాలు
   D.) సైటోప్లాస్ట్‌లు

Answer: Option 'C'

సంశ్లేషిత/ కృత్రిమ విత్తనాలు

16.

విపరీతమైన, తీవ్రమైన శ్వాసకోస సిండ్రోమ్ (SARS) దేని వల్ల సంభవిస్తుంది?

   A.) బాక్టీరియా 
   B.) ఫంగి(శిలీంధ్రాలు)
   C.) ప్రోటోజోవాలు(ఏక కణ సూక్ష్మజీవులు)
   D.) వైరస్

Answer: Option 'D'

వైరస్

17.

కణజాలవర్ధనంలో ఏర్పడే ‘అవయవ విభేదనం’ చెందని కణాల సముదాయాన్ని ఏమంటారు?

   A.) కాలస్ 
   B.) కాలోస్ 
   C.) క్లోన్  
   D.) ఎక్స్‌ప్లాంట్

Answer: Option 'A'

కాలస్ 

18.

యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచిన నూతన ఔషధం పేరు? 

   A.) ఆర్‌బాక్టివ్ 
   B.) డాల్వేన్స్
   C.) సిక్సెర్‌ట్రో 
   D.) స్టెఫ్‌ఎఫెక్ట్

Answer: Option 'D'

స్టెఫ్‌ఎఫెక్ట్

19.

జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది? 

   A.) పపేన్  
   B.) రెన్నెట్
   C.) లైపాక్సిజినేజ్ 
   D.) లైపేజ్ 

Answer: Option 'B'

రెన్నెట్

20.

కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి? 
 ఎ) ‘డాలి’.. ప్రపంచంలో మొదటిసారిగా సృష్టించిన క్లోన్‌‌డ గొర్రెపిల్ల. దీన్ని ‘రోసేలిన్ ఇన్‌స్టిట్యూట్’ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ సృష్టించారు
 బి) ‘ఈవ్’.. మొదటి క్లోన్‌‌డ బేబీ. దీన్ని సృష్టించిన సంస్థ ‘సియోల్ నేషనల్ యూనివర్సిటీ’
 సి) సంరూప, గరిమా అనే పెయ్య దూడలను సృష్టించింది నేషనల్ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), కర్నాల్ (హర్యానా)

   A.) ఎ, బి 
   B.) బి, సి
   C.) ఎ, సి 
   D.) ఎ, బి, సి

Answer: Option 'C'

ఎ, సి 

21.

కిందివాటిలో జన్యుపరివర్తిత మొక్కకు ఉదాహరణ?

   A.) బంగారు వరి 
   B.) బంగారు వేరుశనగ
   C.) బి.టి. పత్తి 
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

22.

‘సెల్యులార్ టోటిపొటెన్సీ’ అంటే..?  

   A.) ఒక కణం క్షయకరణ విభజన చెందగలిగే శక్తి
   B.) సరైన నియంత్రణ పరిస్థితుల్లో.. ఆక్సిన్ - సైటోకైనిన్‌లను ఉపయోగించి ప్రకాండ వ్యవస్థను ప్రేరేపించడం
   C.) అతి శీతల అభిచర్య జరిపి ఒక మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడం
   D.) అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను   ఏర్పర్చగలిగే కణం అంతర్గత  సామర్థ్యం

Answer: Option 'D'

అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను   ఏర్పర్చగలిగే కణం అంతర్గత  సామర్థ్యం

23.

‘గోల్డెన్ రైస్’ను సృష్టించిన శాస్త్రవేత్త? 

   A.) కొహ్లెర్  
   B.) నాథన్స్
   C.) నార్మన్ బోర్లాగ్ 
   D.) ఇంగోపాట్రికుస్

Answer: Option 'D'

ఇంగోపాట్రికుస్

24.

కిందివాటిలో సరైన వరస క్రమం ఏది? 
 ఎ) బయోపెస్టిసైడ్ ---> బాసిల్లస్ థురింజి యాన్సిస్ ---> మాంసం మృదుత్వానికి ఉపయోగపడుతుంది
 బి) బాక్యులో వైరస్ ---> ఎన్. పి. వి ---> ఆర్థ్రోపాడ్ కీటకాలను వ్యాధిగ్రస్థం చేస్తుంది.
 సి) వరిలో తైపేయి రకం ---> గోల్డెన్ రైస్---> విటమిన్-ఎ ను ఉత్పత్తి చేస్తుంది
 డి) బీటీ పత్తి ---> బీటీ విషపదార్థం---> తోళ్లను మెత్తబరుస్తుంది. 

   A.) ఎ, బి 
   B.) సి, డి
   C.) బి, సి 
   D.) ఎ, డి

Answer: Option 'C'

బి, సి 

25.

కణజాలవర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏది? 

   A.) B.S. యానకం  
   B.) M.S. యానకం  
   C.) S.M. యానకం  
   D.) L.S. యానకం

Answer: Option 'B'

M.S. యానకం  


జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 1 Download Pdf

Recent Posts