మానవ శరీరంలో అతి కఠిన భాగం? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 4

1.

అనుమస్తిష్కం (సెరిబెల్లమ్) దేనికి సంబంధించింది?

   A.) కండరాల కదలిక సమన్వయం
   B.) గ్రాహకాంగం
   C.) జ్ఞాపక శక్తి
   D.) దృష్టి

Answer: Option 'A'

కండరాల కదలిక సమన్వయం

2.

ఆక్సిజన్ లేకుండా ఒక జైవిక పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఏ వాయువును ఉత్పత్తి చేయొచ్చు?

   A.) బొగ్గుపులుసు వాయువు
   B.) నత్రజని
   C.) SO2
   D.) మీథేన్

Answer: Option 'A'

బొగ్గుపులుసు వాయువు

3.

మానవ ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం?

   A.) ఎసిటికామ్లం
   B.) హైడ్రోక్లోరికామ్లం
   C.) ఫార్మికామ్లం
   D.) నైట్రికామ్లం

Answer: Option 'B'

హైడ్రోక్లోరికామ్లం

4.

పురుషుడి గొంతు కంటే స్త్రీ గొంతు కీచుగా ఉంటుంది. ఎందుకంటే?

   A.) అధిక పీడన వ్యాప్తి
   B.) అల్ప పీడన వ్యాప్తి
   C.) అధిక కంపన పరిమితి
   D.) అల్ప కంపన పరిమితి

Answer: Option 'D'

అల్ప కంపన పరిమితి

5.

పాలు అంటే ఏమిటి?

   A.) కొవ్వు విస్తరించి ఉన్న రక్తం
   B.) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
   C.) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
   D.) నీరు విస్తరించి ఉన్న చమురు

Answer: Option 'B'

కొవ్వు విస్తరించి ఉన్న నీరు

6.

మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని పిలిచే గ్రంథి? 

   A.) అడ్రినల్ గ్రంథి
   B.) లివర్/కాలేయం
   C.) థైరాయిడ్-బాలగ్రంథి
   D.) థైమస్-బాలగ్రంథి

Answer: Option 'C'

థైరాయిడ్-బాలగ్రంథి

7.

మెదడులో ఏ భాగం జ్ఞాపకశక్తికి మూలం?

   A.) మస్తిష్కం
   B.) అనుమస్తిష్కం
   C.) అథోపర్యంకం
   D.) దవ్వ

Answer: Option 'A'

మస్తిష్కం

8.

పేస్‌మేకర్ దేనికి సంబంధించింది?

   A.) గుండె
   B.) ఊపిరితిత్తులు
   C.) కాలేయం
   D.) కిడ్నీ

Answer: Option 'A'

గుండె

9.

తుమ్ములు, మింగడం, వాంతులు, వెక్కిల్లు దేని నియంత్రణలో ఉంటాయి?

   A.) మస్తిష్కం
   B.) హైపోథాలమస్
   C.) అనుమస్తిష్కం
   D.) మజ్జాముఖం

Answer: Option 'D'

మజ్జాముఖం

10.

పాల పొదుగు నుంచి - చూషణ ద్వారా పాలను స్రవించేందుకు తోడ్పడే హార్మోన్?

   A.) ప్రోలాక్టిన్
   B.) ఆక్సిటోసిన్
   C.) థైమోసిన్
   D.) అడ్రినలిన్

Answer: Option 'B'

ఆక్సిటోసిన్

11.

కోసిన తర్వాత 2-3 వారాల్లోనే తన పూర్వ స్థితిని తిరిగి దాదాపు 85 శాతం వరకు పెంచుకునే సామర్థ్యం ఉన్న మానవ శరీర అవయం ఏది? 

   A.) ఊపిరితిత్తులు
   B.) కాలేయం
   C.) మూత్రపిండాలు
   D.) మెదడు

Answer: Option 'B'

కాలేయం

12.

మెదడును కప్పి ఉంచే లోపలి పొర?

   A.) ఫ్లూరా
   B.) డ్యురామ్యాటర్
   C.) పియామ్యాటర్
   D.) అరాకినాయిడ్ మెంబ్రేన్

Answer: Option 'C'

పియామ్యాటర్

13.

పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏ విటమిన్ లోపిస్తుంది?

   A.) A
   B.) B2
   C.) D
   D.) B1

Answer: Option 'D'

B1

14.

AB రక్త గ్రూపునకు చెందిన ఒక వ్యక్తిని విశ్వగ్రహీత అని ఎందుకంటారు?

   A.) ప్రతిరక్షక జనకాలు లేనందువల్ల
   B.) ప్రతిరక్షకాలు ఉన్నందువల్ల
   C.) ప్రతిరక్షకాలు లేనందువల్ల
   D.) ప్రతిరక్షకాలు - ప్రతి రక్షక జనకాలు లేనందువల్ల

Answer: Option 'C'

ప్రతిరక్షకాలు లేనందువల్ల

15.

మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి?

   A.) 330
   B.) 280
   C.) 206
   D.) 220

Answer: Option 'C'

206

16.

కృత్రిమంగా మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడాన్ని ఏమంటారు?

   A.) పనోరిసిస్
   B.) మానోమీటర్
   C.) డయాలసిస్
   D.) డయామెంటేషన్

Answer: Option 'C'

డయాలసిస్

17.

ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది?

   A.) A
   B.) D
   C.) K
   D.) C

Answer: Option 'D'

C

18.

మొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం?

   A.) మీథేన్
   B.) బెంజీన్
   C.) గ్లూకోజ్
   D.) యూరియా

Answer: Option 'D'

యూరియా

19.

పార్కిన్‌సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? 

   A.) గుండె
   B.) కాలేయం
   C.) మెదడు
   D.) చర్మం

Answer: Option 'C'

మెదడు

20.

బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అంటే ఏమిటి?

   A.) గుండె బైపాస్ శస్త్ర చికిత్స
   B.) పొట్ట బైపాస్ శస్త్ర చికిత్స
   C.) మెదడు సర్జరీ
   D.) సియామీ కవలలను విడదీసే సర్జరీ

Answer: Option 'B'

పొట్ట బైపాస్ శస్త్ర చికిత్స


మానవ శరీరంలో అతి కఠిన భాగం? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 4 Download Pdf

Recent Posts