కింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ఏ ధర్మాన్ని కాంతి ప్రదర్శిస్తుంది? - మాదిరి ప్రశ్నలు - జవాబులు - 2 MCQs

1.

కింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ఏ ధర్మాన్ని కాంతి ప్రదర్శిస్తుంది?

   A.) రుజువర్తనం 
   B.) ధ్రువణం 
   C.) పరావర్తనం
   D.) వివర్తనం 

Answer: Option 'B'

ధ్రువణం 

2.

కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
 1) ధ్వని తీవ్రత ‘కంపన పరిమితి’పై ఆధారపడి ఉంటుంది
 2) ధ్వని స్థాయిత్వం ‘పౌనఃపున్యం’పై ఆధారపడి ఉంటుంది
 3) ధ్వని వేగం ‘యానక స్వభావం’పై ఆధారపడి ఉంటుంది
 4) కంపన కణాల్లో మాత్రమే ధ్వని జనిస్తుంది

   A.) 1, 2, 3 
   B.) 2, 3, 4
   C.) 1, 3, 4 
   D.) 1, 2, 3, 4

Answer: Option 'D'

1, 2, 3, 4

3.

రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?

   A.) కాంతి సంవత్సరం
   B.) పార్‌లాస్టిక్ సెకండ్
   C.) ఖగోళ ప్రమాణం
   D.) కిలోమీటర్

Answer: Option 'B'

పార్‌లాస్టిక్ సెకండ్

4.

కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారు?

   A.) ఆప్తమాలజీ 
   B.) సోలార్ సైన్స్
   C.) ఫొటోమెట్రి 
   D.) ఆప్టోమెట్రి 

Answer: Option 'C'

ఫొటోమెట్రి 

5.

అతినీలలోహిత కిరణాలను గుర్తించడానికి ఏ గాజుతో తయారు చేసిన పట్టకాలను ఉపయోగిస్తారు?

   A.) పెరైక్స్
   B.) క్వార్‌‌ట్జ 
   C.) సోడా 
   D.) ప్లింట్

Answer: Option 'B'

క్వార్‌‌ట్జ 

6.

‘అణుబాంబు పితామహుడు’గా ఎవరిని పేర్కొంటారు?

   A.) ఐన్‌స్టీన్ 
   B.) ఫెర్మి 
   C.) ఒపెన్‌హైమర్
   D.) ఎడ్వర్‌‌డ టెల్లర్

Answer: Option 'C'

ఒపెన్‌హైమర్

7.

మొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను నిర్మించినవారు?

   A.) హెచ్.జి. బాబా
   B.) ఫెర్మి 
   C.) ఐన్‌స్టీన్
   D.) రూథర్‌ఫర్డ్

Answer: Option 'B'

ఫెర్మి 

8.

విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో రుజు మార్గంలో ప్రయాణించే కిరణాలు ఏవి?

   A.) కాంతి కిరణాలు
   B.) ఎక్స్ - కిరణాలు
   C.) గామా కిరణాలు 
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

9.

‘కృత్రిమ సూర్యుడు’(Artificial sun) లో ఏ చర్య జరుగుతుంది?

   A.) కేంద్రక సంలీనం
   B.) కేంద్రక విచ్ఛిత్తి 
   C.) ఎ, బి 
   D.) రసాయన చర్య

Answer: Option 'A'

కేంద్రక సంలీనం

10.

కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది ఏది?

   A.) లారెన్షియం
   B.) ప్లుటోనియం 
   C.) క్యూరియం 
   D.) యురేనియం 

Answer: Option 'D'

యురేనియం 

కింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ఏ ధర్మాన్ని ప్రశ్నలు - 2 Download Pdf