తెలుగు లో పాలిటీ మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 1 for AP Grama Sachivalayam

1.

కింది వాటిలో సరైంది ఏది?

   A.) ఎస్సీలకు ఉప ప్రణాళిక - 1999
   B.) ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం - 1989
   C.) ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల వర్తింపు - 1951
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

2.

మంత్రులకు పోర్ట్ ఫోలియోను కేటాయించేది ఎవరు?

   A.) ముఖ్యమంత్రి
   B.) గవర్నర్
   C.) ముఖ్య కార్యదర్శి
   D.) పైవారెవరూ కాదు

Answer: Option 'A'

ముఖ్యమంత్రి

3.

కింది వాటిలో భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది?

   A.) సావధాన తీర్మానం
   B.) జీరో అవర్
   C.) పాయింట్ ఆఫ్ ఆర్డర్
   D.) 1, 2

Answer: Option 'D'

1, 2

4.

జతపరచండి. 

జాబితా-1 జాబితా-2
i) 1960 ఎ) బెరూబారి కేసు
ii) 1973 బి) కేశవానంద భారతి కేసు
iii) 1975 సి) ఇందిరాగాంధీ - రాజ్‌నారాయణ కేసు
iv) 1980 డి) మినర్వామిల్స్ కేసు

   A.) i-ఎ, ii-బి, iii-సి, iv-డి
   B.) i-బి, ii-ఎ, iii-డి, iv-సి
   C.) i-ఎ, ii-బి, iii-డి, iv-సి
   D.) i-సి, ii-ఎ, iii-డి, iv-బి

Answer: Option 'A'

i-ఎ, ii-బి, iii-సి, iv-డి

5.

సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమల్లోకి వస్తాయి. కానీ కొన్ని నిబంధనల్లో ప్రస్తావించిన హక్కుల అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. కింది వాటిలో అలాంటి నిబంధన ఏది?
ఎ. 17
బి. 21
సి. 23
డి. 24

   A.) ఎ మాత్రమే
   B.) ఎ, సి, డి 
   C.) సి, డి మాత్రమే
   D.) ఎ, సి, డి

Answer: Option 'D'

ఎ, సి, డి

6.

గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?

   A.) పదవీ భద్రత లేదు
   B.) అభిశంసన చేయడానికి వీలు లేదు
   C.) మంత్రిమండలి సలహాను పాటించాలి
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

7.

కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది?

   A.) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
   B.) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
   C.) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడటం
   D.) సామాజిక న్యాయాన్ని అందించడం

Answer: Option 'D'

సామాజిక న్యాయాన్ని అందించడం

8.

కింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు?

   A.) సర్పంచ్
   B.) ఉప సర్పంచ్
   C.) మండల ఉపాధ్యక్షుడు
   D.) పై వారందరూ

Answer: Option 'A'

సర్పంచ్

9.

నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది?

   A.) రాష్ట్రపతి
   B.) రాజ్యసభ
   C.) పార్లమెంట్
   D.) పైవేవీకాదు

Answer: Option 'C'

పార్లమెంట్

10.

డీ ఫాక్టో, డీ జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది?

   A.) పార్లమెంటరీ వ్యవస్థ
   B.) అధ్యక్ష వ్యవస్థ
   C.) సమాఖ్య వ్యవస్థ 
   D.) పైవన్నీ

Answer: Option 'A'

పార్లమెంటరీ వ్యవస్థ

11.

న్యాయ సమీక్షాధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు?

   A.) 12
   B.) 13
   C.) 14
   D.) 15

Answer: Option 'B'

13

12.

కింది వాటిలో సరికానిది ఏది?

   A.) మొదటి లా కమిషన్ అధ్యక్షుడు - లార్డ్ మెకాలే
   B.) మొదటి లా కమిషన్ అధ్యక్షుడు (స్వాతంత్య్రానంతరం) - ఎం.సి. సెతల్వాద్
   C.) 21వ లా కమిషన్ అధ్యక్షుడు - జస్టిస్ బల్బీర్‌సింగ్ చౌహాన్
   D.) పైవేవీ కాదు

Answer: Option 'D'

పైవేవీ కాదు

13.

గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?

   A.) నిర్ణీత కోరం ఉండదు
   B.) సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి
   C.) గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

14.

బడ్జెట్ తయారీలో భాగస్వామ్యం కలిగి ఉన్నవారు/ ఉన్నది?

   A.) నీతి ఆయోగ్
   B.) వివిధ శాఖామాత్యులు
   C.) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
   D.) 1, 2, 3

Answer: Option 'D'

1, 2, 3

15.

కింది వాటిలో భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది?

   A.) అఖిల భారత సర్వీసులు
   B.) పంచాయతీరాజ్ వ్యవస్థ
   C.) రక్షిత వివక్ష
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

తెలుగు లో పాలిటీ మాదిరి బిట్‌బ్యాంక్ - 1 Download Pdf