భారత ఎన్నికల సంఘం నిర్వహించని ఎన్నిక ఏది?

1.

కింది దేశాలు తమ దేశ వయోజనులకు సార్వజనీన ఓటు హక్కు కల్పించిన సంవత్సరం ఆధారంగా సరైన కాలక్రమంలో అమర్చండి?
ఎ) న్యూజిలాండ్ 
బి) భారత్
సి) బ్రిటన్
డి) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఇ) శ్రీలంక

   A.) ఎ, సి, బి, డి, ఇ
   B.) బి, ఎ, సి, డి, ఇ
   C.) ఎ, సి, ఇ, బి, డి
   D.) ఎ, సి, డి, ఇ, బి

Answer: Option 'C'

1. న్యూజిలాండ్ - 1893 
2. రష్యా-1917
3. జర్మనీ - 1918
4. నెదర్లాండ్స్ - 1919
5. బ్రిటన్ - 1928
6. శ్రీలంక - 1931
7. టర్కీ - 1934
8. ఫ్రాన్‌‌స -1944
9. జపాన్ - 1945
10. భారత్ - 1950
11. అర్జెంటీనా - 1951
12. గ్రీస్ - 1952
13. మలేషియా - 1955
14. ఆస్ట్రేలియా - 1962
15. అమెరికా సంయుక్త రాష్ట్రాలు- 1965
16. స్పెయిన్ - 1978
17. దక్షిణాఫ్రికా - 1994

2.

భారతదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ ద్వారా కింది ఏ ప్రాంతాలు విలీనం అయ్యాయి ?
ఎ) హైదరాబాద్ 
బి) జునాఘడ్
సి) సిక్కిం 
డి) నాగాలాండ్

   A.) బి, సి 
   B.) ఎ, డి
   C.) ఎ, బి, సి 
   D.) సి, డి

Answer: Option 'A'

హైదరాబాద్ సంస్థానం పోలీస్ చర్య అనే ప్రక్రియ ద్వారా భారతదేశంలో విలీనం అయింది. జునాఘడ్, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం అయింది. సిక్కిం కూడా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం అయి సహ రాష్ట్రం హోదా పొంది, తర్వాత పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పొందింది.

3.

లోక్ సభ, రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కింది వాటిలో దేనిలో పాలుపంచుకోరు?
ఎ) రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
బి) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం తెలిపే ప్రక్రియ
సి) రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ
డి) ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
ఇ) ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ

   A.) ఎ, ఇ 
   B.) బి, సి
   C.) ఎ మాత్రమే 
   D.) డి మాత్రమే

Answer: Option 'C'

పార్లమెంట్ ఉభయసభలకు నామినేట్ అయిన సభ్యులు కింది ప్రక్రియల్లో పాలుపంచుకుంటారు.
1. రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ
2. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
3. ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ
4. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రక్రియ
రాష్ట్రపతి ఎన్నికల నియోజక గణంలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన నామినేటెడ్ సభ్యులు భాగం కాదు.

4.

భారతదేశ సుప్రీంకోర్ట్..
ఎ) ఒక ఫెడరల్ కోర్‌‌టగా పనిచేస్తుంది.
బి) పౌరుల ప్రాథమిక హక్కుల హామీ దారుగా పనిచేస్తుంది
సి) భారత రాజ్యాంగ సంరక్షకుడిగా పనిచేస్తుంది.
డి) కేంద్ర, రాష్ట్ర శాసనాల అమలుదారుగా పనిచేస్తుంది.

   A.) ఎ, బి 
   B.) బి, సి
   C.) ఎ, డి 
   D.) ఎ, బి, సి

Answer: Option 'D'

భారతదేశ సుప్రీంకోర్టు ఒక ఫెడరల్ కోర్టుగాను, భారతదేశంలో అప్పీళ్లకు సంబంధించి అత్యున్నత కోర్టుగాను, ప్రాథమిక హక్కుల హామీదారుగాను, భారత రాజ్యాంగ సంరక్షణకర్త గాను పనిచేస్తుంది.
సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర శాసనాలను అమలుపరచదు. కేంద్రంలో కేంద్ర కార్యనిర్వహక శాఖ, రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యనిర్వాహఖ శాఖలు శాసనాలను అమలుపరుస్తాయి. ఈ శాసనాల అమలు తీరును సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేసి, ఏవైనా కేంద్ర, రాష్ట్ర శాసనాలు అసంబద్ధంగా ఉంటే అవి చెల్లవని తీర్పు వెలువరిస్తుంది.

5.

కింద పేర్కొన్న ఏ రాజ్యాంగబద్ధ పదవులను ఒక వ్యక్తి ఒకసారి కంటే ఎక్కువసార్లు నిర్వహించరాదు? 
ఎ) రాష్ట్రపతి 
బి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 
సి) రాజ్యసభ ఛైర్మన్ 
డి) రాష్ట్ర గవర్నర్
ఇ) కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి

   A.) ఎ, బి 
   B.) ఎ, సి, ఇ
   C.) బి, ఇ 
   D.) బి, సి, డి, ఇ

Answer: Option 'C'

భారత రాజ్యాంగంలోని నిబంధన 57 ప్రకారం ఒకసారి రాష్ట్రపతిగా పదవి నిర్వర్తించినా లేదా నిర్వహిస్త్తున్న వ్యక్తి తిరిగి ఎన్నిక అవడానికి ఉన్న అర్హతలను గురించి తెలియజేస్తుంది. ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పదవిని నిర్వర్తిస్తున్న లేదా నిర్వహించినా తిరిగి ఆ పదవికి ఎన్నిక కావచ్చు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌గా పని చేసిన వ్యక్తి తిరిగి ఆ పదవిని చేపట్టరాదు. అదే విధంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా పని చేసిన వ్యక్తి కేంద్రప్రభుత్వంలో కానీ, రాష్ర ్టప్రభుత్వంలో కానీ ఎలాంటి పదవిని చేపట్టరాదు. ఒకసారి రాజ్యసభ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి తిరిగి ఆ పదవికి ఎన్నిక కావచ్చు. 
ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన లేదా చేస్తున్న వ్యక్తి రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. అంటే సాధారణంగా అతడు గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుంచి 5 ఏళ్లు ఆ పదవిలో కొనసాగుతాడు. అంతే కాకుండా ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన లేదా పనిచేస్తున్న వ్యక్తి 5 ఏళ్ల కాలపరిమితి ముగిసినా రాష్ట్రపతి అభీష్టం మేరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవిని చేపట్టరాదు.

6.

ద్రవ్యబిల్లుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ద్రవ్య బిల్లును మొదటగా లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
బి) రాజ్యసభ ద్రవ్యబిల్లును తిరస్కరణ గానీ, సవరణగానీ చేయరాదు

   A.) ఎ మాత్రమే 
   B.) బి మాత్రమే
   C.) ఎ, బి 
   D.) ఏదీకాదు

Answer: Option 'C'

ద్రవ్యబిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం కోసం రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విధానం పొందుపరిచింది.
1. ద్రవ్యబిల్లును రాష్ర్టపతి ముందస్తు అనుమతితో కేవలం లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
2. ప్రతి ద్రవ్య సంబంధమైన బిల్లును ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు, ఆ బిల్లును కేవలం మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి.
3. ద్రవ్యబిల్లును లోక్‌సభ ఆమోదించిన తర్వాత, ఆమోదం కోసం రాజ్యసభకు పంపుతారు. ద్రవ్యబిల్లు విషయంలో రాజ్యసభకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యసభ ద్రవ్య బిల్లులను తిరస్కరించరాదు, సవరణలు ప్రతిపాదించరాదు. రాజ్యసభ ద్రవ్య బిల్లుల విషయంలో కేవలం సూచనలు మాత్రమే చేయగలదు. ఈ సూచనలను లోక్‌సభ అనుసరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

7.

రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) రాజ్యసభ రద్దుకాదు శాశ్వత సభ
బి) ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
సి) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులందరూ, పరోక్ష ఎన్నిక విధానంలో ఎన్నికవుతారు.

   A.) ఎ మాత్రమే 
   B.) బి మాత్రమే
   C.) సి మాత్రమే 
   D.) ఏదీకాదు

Answer: Option 'D'

రాజ్యసభ అనేది శాశ్వత సభ, ఇది రద్దుకాదు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు. రాజ్యసభ సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు 1/3వ వంతు చొప్పున పదవీ విరమణ చేస్తారు. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు పరోక్ష విధానం (నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి, రహస్య బ్యాలెట్) ద్వారా ఎన్నికవుతారు.దేశంలోని రాష్ట్ర విధాన సభ సభ్యులను ప్రజలు ఎన్నుకొంటారు. ఇలా ప్రజలచేత ఎన్నికైన విధానసభ సభ్యులు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో పాల్గొంటారు.
రాజ్యసభలో ప్రతి రెండేళ్లకు 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయడం, తిరిగి కొత్త సభ్యులు ఎన్నికవుతారు. కాబట్టి రాజ్యసభను ‘కొత్త, పాతల మేళవింపు’గా పరిగణిస్తారు.

8.

అటార్నీ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఈ పదవిని భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది.
బి) అటార్నీ జనరల్‌ను ప్రధానమంత్రి నియామకం చేస్తారు.
సి) గతంలో ఇతడికి సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉండాలి
డి) ఇతడు ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి సంబంధించిన న్యాయ సంబంధ విషయాల్లో సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహిస్తారు.

   A.) సి, డి 
   B.) ఎ, సి
   C.) ఎ, డి 
   D.) ఎ, బి, సి, డి

Answer: Option 'C'

అటార్నీ జనరల్‌కు సంబంధించి భారత రాజ్యాంగంలోని నిబంధన 76 పేర్కొంటుంది. 
- ఇతడిని రాష్ట్రపతి నియమిస్తారు.
- ఇతడు సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి. 
- గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అనుభవం అవసరం లేదు.
సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి కావలసిన అర్హతలు:
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. దేశంలో ఏదైనా హైకోర్టులో 5 ఏళ్ల జడ్జిగా పనిచేసి ఉండాలి లేదా ఏదైనా హైకోర్టులో 10 ఏళ్లు అడ్వకేట్‌గా పనిచేసి ఉండాలి. లేదా రాష్ట్రపతి అభిప్రాయంలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి. 
- ఇతడు దేశంలో అత్తున్నత న్యాయ అధికారి.

9.

భారతదేశ వలస పాలనలో రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రాముఖ్యతను గుర్తించండి? 
ఎ) భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలన నియంత్రణ, నిర్వహణకు సంబంధించి ఈ చట్టాన్ని మొదటి మెట్టుగా పరిగణిస్తారు.
బి) ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనే పదవి భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్పు చేసి, అతడికి ముఖ్యమైన కార్యనిర్వాహక అధికారాలను కల్పించారు.
సి) ఈ చట్టం ప్రకారం బాంబే ప్రెసిడెన్సీలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు.

   A.) ఎ, బి 
   B.) ఎ, సి
   C.) బి, సి 
   D.)

Answer: Option 'A'

వివరణ: 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనే పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్పు చేసి, నలుగురు సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని అతడికి సహాయ సహకారాలు అందించడం కోసం ఏర్పాటు చేశారు.
  మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్‌‌స పనిచేశారు. 
  1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలో 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
  1773 రెగ్యులేటింగ్ చట్టానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.
  భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పరిపాలన, నియంత్రణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొన్న మొదటి మెట్టుగా ఈ చట్టాన్ని పేర్కొంటారు.
  ఈ చట్టం మొదటిసారిగా కంపెనీ రాజకీయ, పరిపాలన విధులను గుర్తించింది.
  ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు పునాది వేసింది. ఈ చట్టం ప్రకారం బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ జనరల్‌లు బెంగాల్ గవర్నర్ జనరల్‌కు అదీనులుగా చేశారు. కంపెనీ ఉద్యోగులు ఏదైనా ప్రైవేట్ వ్యాపారం చేయడాన్ని లేదా స్థానికుల నుంచి బహుమతులు, లంచం తీసుకోవడంపై ఈ చట్టం నిషేధం విధించింది.

10.

కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో ఉన్న సందర్భంలో జారీ చేసిన ఆర్డినెన్‌‌స చెల్లుబాటు కాదు.
బి) ఆర్డినెన్‌‌స జారీ చేస్తూ రాష్ట్రపతి తీసుకొన్న నిర్ణయాన్ని కోర్టుల ద్వారా ప్రశ్నించవచ్చు 

   A.) ఎ మాత్రమే 
   B.) బి మాత్రమే
   C.) ఎ, బి 
   D.) ఏదీకాదు

Answer: Option 'C'

ఆర్డినెన్‌‌సను జారీ చేసే అధికారం రాష్ట్రపతి ముఖ్యమైన శాసన అధికారాల్లో ఒకటి. అత్యవసరంగా ఏదైనా ఒక విషయంపై చట్టం చేయాల్సి వచ్చి పార్లమెంట్ ఉభయసభలు సమావేశంలో లేని సమయంలో రాష్ట్రపతి ఆర్డినెన్‌‌స జారీ చేయవచ్చు. లేదా పార్లమెంట్ ఉభయసభల్లో ఒక సభ సమావేశంలో లేని సమయంలోనైనా ఆర్డినెన్‌‌సను జారీ చేయవచ్చు. పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమైన సమయంలో జారీ చేసిన ఆర్డినెన్‌‌స చెల్లుబాటు కాదు.
రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్‌‌స జారీచేసే అధికారం పార్లమెంట్‌కు ఉన్న శాసన అధికారానికి సమాంతరం కాదు. కేవలం సహసంబంధ అధికారం మాత్రమే.
ఆర్.సి. కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1970 కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఆర్డినెన్‌‌స జారీ చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు దురుద్దేశ్య కారణాలతో కూడి ఉన్నట్లయితే న్యాయ స్థానంలో సవాలు చేయవచ్చు.

11.

భారత రాజ్యాంగంలో కింద పేర్కొన్న ఏయే అంశాలు ప్రత్యేకంగా సామాజిక న్యాయం, సాధికారితకు సంబంధించినవి?
ఎ) ప్రవేశిక 
బి) మొదటి షెడ్యూల్
సి) మూడో షెడ్యూల్ 
డి) ప్రాథమిక హక్కులు
ఇ) ఆదేశిక సూత్రాలు

   A.) ఎ, ఇ 
   B.) బి, సి, డి
   C.) ఎ, డి, ఇ 
   D.) ఎ, బి, ఇ

Answer: Option 'C'

ప్రవేశిక:
న్యాయం: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
సమానత్యం: అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వం
సౌభ్రాతృత్వం: వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రత నిర్ధారించేది
మొదటి షెడ్యూల్: భారత్‌దేశంలోని రాష్ట్రాలు, భారత భూభాగం పరిధి గురించి పేర్కొంటుంది.
మూడో షెడ్యూల్: కొన్ని రాజ్యాంగ ఉన్నత పదవుల పదవీ ప్రమాణ స్వీకారం గురించి పేర్కొంటుంది.
నిబంధన 23: మనుషుల అక్రమ రవాణా, వెట్టి చాకిరీ (బేగార్)ను నిషేధిస్తుంది.
నిబంధన 24: ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో చిన్న పిల్లలను పనుల్లో వినియోగించడం నిషేధిస్తుంది.
నిబంధన 38: ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థ ఉండాలి.

12.

రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది?

   A.) సాంప్రదాయ హక్కు
   B.) ప్రాథమిక హక్కు 
   C.) చట్టబద్ధ హక్కు
   D.) నైతిక హక్కు

Answer: Option 'B'

వివరణ: రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కుల ఆత్మ, అంతరంగంగా పరిగణిస్తారు. భారత రాజ్యాంగంలోని మూడో భాగంలోని ఇతర ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఇది తోడ్పాటును అందిస్తుంది. 32వ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి గానీ, సంస్థగానీ మరో వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే అతడు సుప్రీంకోర్టును గానీ, హైకోర్టును గానీ ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు ప్రాథమిక హక్కుల అమలు కోసం హెబియస్ కార్పస్, మాండమస్, కో వారంటో, ప్రొహిబిషన్, సెర్షియోరరీలాంటి రిట్లను జారీ చేస్తాయి.

భారత ఎన్నికల సంఘం నిర్వహించని ఎన్నిక ఏది? Download Pdf