పడవలు - ప్రవాహములు పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Boats and Streams For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

A మరియు B అను రెండు పడవలు 108 కి.మీ. ల దూరమును వ్యతిరేకదిశ లో ప్రయాణిస్తూ వున్నవి. నిలకడయిన నీటిలో A మరియు B ల వేగాలు వరుసగా 12 kmph మరియు 15 kmph A ఆ ప్రవాహ దిశలో మరియు B వ్యతిరేక దిశలో ప్రయాణించిన, ఎన్ని గంటలు తరువాత ఆ రెండు పడవలు కలుస్తాయి?

   A.) 7 గంటలు 
   B.) 6 గంటలు 
   C.) 4 గంటలు 
   D.) 5 గంటలు 

Answer: Option 'C'

ప్రవాహ వేగము = x kmph 
ఒకేదిశలో సాపేక్షవేగము = (12 + x) + (15 - x) = 27 (వ్యతిరేకదిశలో సాపేక్ష వేగము = వేగాల మొత్తం)
∴ పట్టు సమయం = (108/27) = 4 గంటలు 

2.

ఒక వ్యక్తి తన పడవలో ప్రవాహ దిశలో 35 కి.మీ. మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 15 కి.మీ లను ఒక్కొక్క దానిని 5 గంటలలో ప్రయాణించగలడు. ప్రవాహ వేగము ఎంత?

   A.) 2 Kmph
   B.) 3 Kmph
   C.) 4 Kmph
   D.) 5 Kmph

Answer: Option 'A'

ప్రవాహ దిశలో పడవ వేగము = (D.S) = 35/5 = 7 kmph
వ్యతిరేక దిశలో పడవ వేగము = (U.S) = 15/5 = 3 kmph 
ప్రవాహ వేగము = (D.S - U.S)/2 = (7 - 3)/2 = 2 Kmph

3.

ఒక వ్యక్తి ప్రవాహ దిశలో  18 కి.మీ. ల దూరమును 4 గంటలలో ప్రయాణిస్తాడు మరియు తిరుగుప్రయాణములో అదే దూరము 12 గంటలలో ప్రయాణిస్తాడు. ప్రవాహ వేగము ఎంత?

   A.) 0.5 kmph
   B.) 3.5 kmph
   C.) 2.5 kmph
   D.) 1.5 kmph

Answer: Option 'D'

D.S = (18/4) = 9/2,
U.S = (18/12) = 3/2
ప్రవాహ వేగము = 1/2 × (D.S - U.S) = 1/2(9/2 - 3/2) = 1.5 kmp

4.

ఒక నావికుడు తన పడవలో ప్రవాహ దిశలో 12 కి.మీ ల దూరమును 48 నిమిషములలో పూర్తి చేసి మరల తిరిగి రావడానికి 1 గంట 20 నిమిషములు సమయం తీసుకుంటాడు. నిలకడయైన నీటిలో పడవ వేగం ఎంత?

   A.) 8 kmph
   B.) 10 kmph
   C.) 12 kmph
   D.) 14 kmph

Answer: Option 'C'

ప్రవాహాదిశలో పడవ వేగము = 12/(48/60) = 15 kmph
వ్యతిరేక దిశలో పడవవేగం = 12/(80/60) = 9 kmph 
∴ నిలకడయైన నీటిలో పడవ వేగము = 1/2 × (15 + 9) = 12 kmph

5.

ఒక వ్యక్తి నిలకడయైన నీటిలో 3 kmph వేగముతో ఈదగలడు. ప్రవాహ వేగము 2 kmph 10 కి.మీ. ల దూరము (ప్రవాహా దిశలో) ఈది మరల తిరిగి రావడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది?

   A.) 12 గంటలు 
   B.) 14 గంటలు 
   C.) 16 గంటలు 
   D.) 19 గంటలు 

Answer: Option 'A'

ప్రవాహ దిశలో వ్యక్తి వేగము = 3 + 2 = 5 kmph 
ప్రవాహ వ్యతిరేక దిశలో వ్యక్తి వేగము = 3 - 2 = 1 kmph
పట్టిన మొత్తం సమయం = (10/5) + (10/1) = 2 + 10 = 12 గంటలు 

పడవలు - ప్రవాహములు Download Pdf

Recent Posts