1.
180 మీ. పొడవుగల A అను రైలు రైలు 90 కి.మీ/గం. వేగంతో వెళ్తుంది. రైల్వే సిగ్నల్ ను ధాటి వెళ్ళుటకు అది ఎంత కాలము తీసుకొనును?
2.
A మరియు B లు ఒక దూరము ని 30 రోజులలో, B మరియు C లు 20 రోజులలో మరియు C మరియు A లు అదే దూరము ని 15 రోజులలో పూర్తి చేస్తారు. ముగ్గురు కలసి ఆ దూరము ని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
3.
150 మీ. ల పొడవు గల రైలు, ఒక టెలిగ్రాఫ్ స్తంభమును 10 సెకన్ల యందు దాటి పోవును. రైలు వేగమును కనుగొనుము?
4.
160 మీ. పొడవైన రైలు 72 కి.మీ/గం. వేగం తో ప్రయాణం చేస్తున్నపుడు, 200 మీ. ప్లాటుఫారం రాటుటకు ఎంత కాలం పట్టును.
5.
134 మీ., 116 మీ. పొడవు కల రెండు రైళ్లు వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తున్నవి. వాని వేగములు వరుసగా 40 కి.మీ/గం. 50 కి.మీ/గం. అయిన ఎంత సేపటికి అవి ఒక దానిని ఒకటి దాటగలవు?
6.
100 మీ. మరియు 120 మీ. పొడవు గల రైళ్లు ఓకే దిశలో ప్రయాణం చేస్తున్నపుడు, వాటి వేగములు వరుసగా 72 కి.మీ/గం. మరియు 54 కి.మీ/గం అయితే, ఎంత సేపటికి మొదటి రైలు, రెండవ రైలును దాటి పోవును.
7.
A, B అను రెండు స్టేషన్ లు 205 కి.మీ. దూరం లో వున్నాయి. ఒక రైలు A స్టేషన్ వద్ద 6 p.m లకు బయలుదేరి 50 కి.మీ/గం.వేగం తో B వైపుగా బయలుదేరింది. మరొకటి B నుండి 9 p.m బయలుదేరి, A వైపుగా 60 కి.మీ/గం. వేగం తో బయలుదేరింది. ఏ సమయంలో రెండు రైళ్ళు కలుసుకొంటాయి.
8.
హైదరాబాద్ నుండి ముంబాయ్ కి రెండు రైళ్ళు 10 a.m., 11.30 a.m. కు బయలుదేరి 50 కి.మీ/గం. వేగం తో మరియు 65 కి.మీ/గం. వేగం లో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాదు నుండి ఎంత దూరం లో ఆ రెండు రైళ్ళు కలుస్తాయి.
9.
ఒక రైలు ఆగకుండా గంటకు 90 కి.మీ. వేగంతో కొంత దూరం ప్రయాణిస్తుంది మరియు 72 కి.మీ./గం. వేగంతో అదే దురంను ఆగుతూ ప్రయాణిస్తుంది. అయిన గంటకు ఎన్ని నిమిషాలు రైలు ఆగుతూ వున్నది?