లాభా - నష్టాలు పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Profit and Loss For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

CP = రూ. 116, SP = రూ. 127 అయిన లాభం = ?

   A.) రూ. 11
   B.) రూ. 12
   C.) రూ. 13
   D.) రూ. 14

Answer: Option 'A'

లాభం = SP - CP = 127 - 116 = రూ. 11

2.

ఒక వస్తువు కొన్నవేల రూ. 200 మరియు అమ్మినవేల రూ. 250 అయిన లాభ శాతం?

   A.) 30%
   B.) 25%
   C.) 35%
   D.) 22%

Answer: Option 'B'

లాభ శాతం = [(లాభం/కోన్నవేల) × 100]% = [(50/200) × 100]% = 25%
Alternate method :
కోన్నవేల ఎల్లప్పుడూ 100% గా ఉంటుంది.
కోన్నవేల = 200 = 100% (1/2 రెట్లు)
లాభం = 50 = 50 7times; (1/2) = 25%

3.

ఒక వ్యక్తి తన స్క్యూటర్ ను రూ. 10500 లకు అమ్మగా 5% లాభం పొందుతాడు. స్కూటర్ కొన్న వెల ఎంత?

   A.) రూ. 10000
   B.) రూ. 11000
   C.) రూ. 12000
   D.) రూ. 10700

Answer: Option 'A'

కొన్న వెల = అమ్మిన వెల × [(100/(100+లాభశాతం)]
= 10500 × (100/105) = రూ. 10000

4.

మోహన్ ఒక గడియారమును రూ. 350 లకు కొని తిరిగి దానిని రూ. 392 లకు అమ్మితే లాభశాతం?

   A.) 15%
   B.) 10%
   C.) 12%
   D.) 14%

Answer: Option 'C'

లాభశాతం = [(42/350) × 100]% = 12%

5.

CP = 235, SP = రూ. 220 అయిన నష్టం = ?

   A.) రూ. 12
   B.) రూ. 13
   C.) రూ. 14
   D.) రూ. 15

Answer: Option 'D'

నష్టం = CP - SP = 235 - 220 = రూ. 15

6.

ఒక వ్యాపారి రూ. 10 లకు డజను చొప్పున 200 డజన్ల నారింజ పండ్లను కొనుగోలు చేసి మరియు వాటి రవాణా చేయుటకు రూ. 500 లు ఖర్చు చేసి తిరిగి వాటిని 'రూపాయి'కి ఒక్కటి చొప్పున అమ్మితే వ్యాపారి పొందే లాభ లేదా నష్ట శాతం?

   A.) 8%
   B.) 6%
   C.) 5%
   D.) 4%

Answer: Option 'D'

కొన్న వెల = 200 × 10 = 2000 + 500 = 2500 
అమ్మిన వెల = 200 × 12 × 1 = 2400 
నష్ట శాతం = [(100/2500) × 100]% = 4%
 

7.

రజిత్ ఒక సైకిల్ ను రూ. 5200 లకు కొనుగోలు చేసి, దాని మరమ్మత్తుల కొరకు రూ. 800 ఖర్చు చేసి తిరిగి దానిని రూ. 5500 లకు అమ్మిన లాభ లేదా నష్టశాతం?

   A.) 12% లాభం
   B.)  9% లాభం
   C.) 8(1/3)%    నష్టం
   D.) 7(1/2)% లాభం

Answer: Option 'C'

సూచన : మరమత్తులు లేదా రవాణా ఖర్చులు వగైర ఏవైనా ఖర్చులు ఉన్నట్లయితే కొనుగోలు ధరకు కలిపినా అది కొన్నవేల అవుతుంది.
కొన్న వెల = 5200 + 800 = 6000 > 5500 
నష్టశాతం = (500/6000) × 100]% = 8(1/3)%

8.

ఒక వస్తువు కొన్నవేల మరియు అమ్మిన వేళలు వరుసగా రూ. 1200 /- మరియు రూ. 1500 లాభ శాతం?

   A.) 16(2/3)%
   B.) 15%
   C.) 20%
   D.) 25%

Answer: Option 'D'

లాభ శాతం = [(300/1200) × 100]% = 25%
Alternate method : 
కొన్నవేల = 1200 = 100%
లాభం = 300 = 25%

9.

మబ్బు ఒక కెమెరా ను రూ. 1800 లకు కొనుగోలు చేసి దానిని 10 % నష్టం నకు అమ్ముతాడు. అమ్మిన వెల వస్తుంది?

   A.) రూ. 1620/-
   B.) రూ. 1730/-
   C.) రూ. 1650/-
   D.) రూ. 2000/-

Answer: Option 'A'

అమ్మిన వెల = కొన్న వెల × (100 - నష్ట శాతం/100) 
= 1800 × (90/100) = రూ. 1620

10.

లక్ష్మి 10 వస్తువులను రూ. 8 లకు కొనుగోలు చేసి ఒక్కొక్క వస్తువును రూ. 1.25 ల చొప్పున అమ్మిన లాభ శాతం ఎంత?

   A.) 55%
   B.) 25%
   C.) 56(1/4)%
   D.) 40%

Answer: Option 'C'

10 వస్తువుల అమ్మిన వెల = 10 × 1.25 = 12.50
లాభ శాతం = [(4.5/8) × 100]% = 450/8 = 56(1/4)%

లాభా - నష్టాలు Download Pdf

Recent Posts