కాలము - పని పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Time and Work For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

A, B లు కలసి ఒక పనిని 12 రోజులలో చేయగలరు. B ఒక్కడే ఆ పనిని 18 రోజులలో చేయగలడు. అయిన A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు.

   A.) 30 రోజులు
   B.) 32 రోజులు
   C.) 36 రోజులు
   D.) 34 రోజులు

Answer: Option 'C'

AB - B => A 
(12 × 18)/6 = 36 రోజులు
AB - A = A 
(1/12) - (1/18) = (3 - 2)/36 = 1/36 = 36 రోజులు

2.

ఒక పనిని A -> 10 రోజులలోను, B -> 12 రోజులలో చేస్తారు. వారిద్దరు C సహాయం తో ఆ పనిని 4 రోజులలోనే పూర్తి చేసెను. అయిన C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు?

   A.) 11 రోజులు
   B.) 18 రోజులు
   C.) 12 రోజులు
   D.) 15 రోజులు

Answer: Option 'D'

(ABC) - (A + B) = C 
(1/4) - (1/10 + 1/12) 
(1/4 - 1/10 - 1/12) = (15 - 6 -5)/60 = 4/60 = 1/15 = 15 రోజులు

3.

A ఒక పనిని 30 రోజులలో చేయగలడు. B అదే పనిని 45 రోజులలో చేయగలడు. అయిన వారిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు.

   A.) 19 రోజులు
   B.) 14 రోజులు
   C.) 16 రోజులు
   D.) 18 రోజులు

Answer: Option 'D'

(30 × 45)/75 = 18 రోజులు

4.

A B మరియు C అను మూడు పైపులు ఒక ట్యాంకును 10 12 మరియు 15 గంటలలో నింపగలవు. 3 పైపులను ఓకేసారి తెరిసిన, ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది?

   A.) 4 గంటలు
   B.) 5 గంటలు
   C.) 6 గంటలు
   D.) 7 గంటలు

Answer: Option 'A'

4 గంటలు
పట్టు సమయం = 1/10 + 1/12 + 1/15 = (6 + 5 + 4)/60 = 15/60 = 1/4
∴ 4 గంటలలో నిండును

5.

A ఒక పనిని 20 రోజులలో చేయగలడు. B అదే పనిని 12 రోజులలో చేయగలడు. మొదట B ఆ పనిని ప్రారంభించి 9 రోజులు చేసిన తరువాత ఆ పనిని వదిలి వెళ్లి పోయెను. అయిన మిగిలిన పనిని A ఒక్కడే ఎంత కాలం లో చేయగలడు?

   A.) 4 రోజులు
   B.) 7 రోజులు
   C.) 5 రోజులు
   D.) 6 రోజులు

Answer: Option 'C'

B -> 1/12 × 9 = 3/4 
4 -> 20 
1 -> ?
1/4 × 20 = 5 రోజులు

కాలము - పని Download Pdf

Recent Posts