కరెంటు అఫైర్స్ - 07 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

భారత సినిమా రంగంలో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 2019’కు ఏ నటుడు ఎంపికయ్యారు?

   A.) ఆమిర్‌ఖాన్‌
   B.) అక్షయ్‌ కుమార్‌
   C.) షారుఖ్‌ ఖాన్‌
   D.) అమితాబ్‌ బచ్చన్‌

Answer: Option 'D'

అమితాబ్‌ బచ్చన్‌

2.

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–అపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) సంస్థ ప్రకారం 2019 సంవత్సరానికి (ఎఫ్‌వై–ఫిస్కల్‌ ఇయర్‌ 2020) భారత్‌ జీడీపీ ఎంత?

   A.) 6.1%
   B.) 5.9%
   C.) 6.2%
   D.) 5.7%

Answer: Option 'B'

5.9%

3.

పోలియో, కలరా వంటి సంక్రమణ వ్యాధులను నిర్మూలించడంలో ప్రత్యేక కృషి చేసినందుకు ప్రసిద్ధ ‘వ్యాక్సిన్‌ హీరో –2019’ అవార్డు ఎవరికి లభించింది?

   A.) షేక్‌ హసీనా
   B.) వ్లాదిమిర్‌ పుతిన్‌
   C.) బోరిస్‌ జాన్సన్‌
   D.) నరేంద్ర మోదీ

Answer: Option 'A'

షేక్‌ హసీనా

4.

డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సహకారంతో ఖడ్గమృగాల(Rhinos) సంరక్షణ కోసం క్రికెటర్‌ రోహిత్‌ శర్మ చేపట్టిన ప్రచార కార్యక్రమం  ఏమిటి?

   A.) ప్రొటెక్ట్‌ రైనోస్‌ కాంపెయిన్‌
   B.) రోహిత్‌ 4 రైనోస్‌ కాంపెయిన్‌
   C.) లెట్స్‌ ప్రొటెక్ట్‌ రైనోస్‌ కాంపెయిన్‌
   D.) రోహిత్‌ టు ప్రొటెక్ట్‌ రైనోస్‌ కాంపెయిన్‌

Answer: Option 'B'

రోహిత్‌ 4 రైనోస్‌ కాంపెయిన్‌

5.

ప్రఖ్యాత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.  సింధూను రెండేళ్ల కాలానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌  ఏది?

   A.) ఎలో
   B.) అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌
   C.) విసా
   D.) మాస్టర్‌ కార్డ్‌

Answer: Option 'C'

విసా

6.

2019 సెప్టెంబర్‌ 19 గాను ఫిఫా (ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ది ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌) పురుషుల ర్యాంకింగ్‌లో భారత ర్యాంక్‌ ఎంత?

   A.) 104 
   B.) 102 
   C.) 100
   D.) 103

Answer: Option 'A'

104 

7.

జపాన్‌లోని సెసిబోలో జరిగిన భారత్, జపాన్, యూఎస్‌ మధ్య జరిగిన  త్రైపాక్షిక సముద్ర వ్యాయామం పేరు ఏమిటి?

   A.) ఇన్‌జాస్‌ 2019
   B.) మలబార్‌ 2019
   C.) వరుణ 2019
   D.) మిలాన్‌ 2019

Answer: Option 'B'

మలబార్‌ 2019

8.

బెంగళూరుకు చెందిన గౌరీ లంకేష్‌ ట్రస్ట్‌ బోర్టు అందించే తొలి ‘గౌరీ లంకేష్‌ మెమోరియల్‌ అవార్డు–2019’ ఏ జర్నలిస్ట్‌కు లభించింది?

   A.) అర్నబ్‌ గోస్వామి 
   B.) రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌
   C.) రవీష్‌ కుమార్‌
   D.) బర్కా దత్‌

Answer: Option 'C'

రవీష్‌ కుమార్‌

9.

ఇటీవల గిన్నీస్‌ బుక్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించిన అతిపెద్ద లఢకీ నృత్యం?

   A.) భవై 
   B.) దేక్‌న్ని
   C.) చలో
   D.) షోన్దోల్‌

Answer: Option 'D'

షోన్దోల్‌

10.

ఐక్యరాజ్యసమితి క్లైమేట్‌ యాక్షన్‌ సమ్మిట్‌–2019 సందర్భంగా నికర కార్బన్‌ ఉద్గారాలను ఏ సంవత్సరం నాటికి సున్నా శాతానికి  తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు?

   A.) 2060
   B.) 2050
   C.) 2045
   D.) 2030

Answer: Option 'B'

2050

11.

మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 20వ నెక్సా ఇంటర్నెషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ( ఐఫా అవార్డ్స్‌) 2019లో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపికైంది?

   A.) రాజీ
   B.) పద్మావత్‌
   C.) అంధాదున్‌
   D.) సంజు

Answer: Option 'A'

రాజీ

12.

పన్ను ప్రోత్సాహకాలు/మినహాయింపులు పొందలేని దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కేంద్రం 30 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది?

   A.) 25%
   B.) 22%
   C.) 15%
   D.) 18%

Answer: Option 'B'

22%

13.

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం(World Rhino Day)ను ఎప్పుడు నిర్వహిస్తారు?

   A.) సెప్టెంబర్‌ 22
   B.) సెప్టెంబర్‌ 21
   C.) సెప్టెంబర్‌ 20
   D.) సెప్టెంబర్‌ 19

Answer: Option 'A'

సెప్టెంబర్‌ 22

14.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో భారత నావికాదళ నావల్‌ డాక్‌యార్డ్‌లో ప్రారంభించిన రెండో స్కార్పీన్‌ క్లాస్‌ జలాంతర్గామి ఏది?

   A.) ఐఎన్‌ఎస్‌ కుర్సురా
   B.) ఐఎన్‌ఎస్‌ వేల
   C.) ఐఎన్‌ఎస్‌ ఖంధేరి
   D.) ఐఎన్‌ఎస్‌ కరంజ్‌

Answer: Option 'C'

ఐఎన్‌ఎస్‌ ఖంధేరి

15.

వాతావరణంలో జరుగుతున్న మార్పుల కోసం పోరాటం చేస్తున్న ఏ స్వీడన్‌ యువ పర్యావరణ కార్యకర్తకు ప్రతిష్టాత్మక స్వీడన్‌ నోబెల్‌ప్రైజ్‌ ‘రైట్‌ లైవ్లీహుడ్‌ 2019’ అవార్డు మరో నలుగురితో కలిసి లభించింది?

   A.) రిధిమా పాండే
   B.) గ్రెటా థన్బర్గ్‌
   C.) లుయిసా న్యుబౌర్‌
   D.) లోగన్‌ రిలే

Answer: Option 'B'

గ్రెటా థన్బర్గ్‌

16.

అంతర్జాతీయ టీ–20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మన్‌ ఎవరు?

   A.) బాబర్‌ అజాం
   B.) శిఖర్‌ ధావన్‌
   C.) రోహిత్‌ శర్మ
   D.) విరాట్‌ కోహ్లీ

Answer: Option 'A'

బాబర్‌ అజాం

17.

10వ ‘వరల్డ్‌ బాంబూ డే –2019’  థీమ్‌ ఏమిటి?

   A.) మై బాంబూ మై వెల్త్‌
   B.) ఎ నేచురల్‌ సెలబ్రేషన్‌
   C.) బాంబూ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌
   D.) బాంబూ యాజ్‌ ఎ టూల్‌ ఫర్‌ ఎకనమిక్‌ సస్టైనబిలిటీ

Answer: Option 'C'

బాంబూ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌

18.

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2019 ఎక్కడ జరిగింది?

   A.) తష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌
   B.) నూర్‌ సుల్తాన్, కజకిస్తాన్‌
   C.) దశాంబె, తజికిస్తాన్‌
   D.) బిష్కెక్, కిర్గిస్తాన్‌

Answer: Option 'B'

నూర్‌ సుల్తాన్, కజకిస్తాన్‌

19.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా 2,450 పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?

   A.) విరాట్‌ కోహ్లీ
   B.) ఎం.ఎస్‌. ధోని
   C.) రోహిత్‌ శర్మ
   D.) శిఖర్‌ ధావన్‌

Answer: Option 'A'

విరాట్‌ కోహ్లీ

20.

ఫోర్బ్స్‌ సంస్థ ఉత్తమ కంపెనీల జాబితా 2019లో అగ్రస్థానంలో ఉన్న భారతీయ కంపెనీ ఏది?

   A.) ఇన్ఫోసిస్‌
   B.) టీసీఎస్‌
   C.) టాటా స్టీల్‌
   D.) టాటా మోటార్స్‌

Answer: Option 'A'

ఇన్ఫోసిస్‌


కరెంటు అఫైర్స్ - 07 October - 2019 Download Pdf

Recent Posts