కరెంటు అఫైర్స్ - 18 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

అత్యంత ప్రతిష్టాత్మక కిమ్‌ జి–సియోక్‌ అవార్డును 2019 సంవత్సరానికి గాను  Iewduh (మార్కెట్‌) సినిమాకు అవార్డు అందుకున్న మొదటి భారత సినీ నిర్మాత ఎవరు?

   A.) షూజిత్‌ సిర్కార్‌
   B.) నీరజ్‌ పాండే
   C.) రాజ్‌కుమార్‌ హిరానీ
   D.) ప్రదీప్‌ కుర్బా

Answer: Option 'D'

ప్రదీప్‌ కుర్బా

2.

పశువుల జనాభా లెక్కలు 20వ ఎడిషన్‌ ప్రకారం 2012 నుంచి 2019 సంవత్సరానికి  పశువుల జనాభా ఎంత శాతం పెరిగింది?

   A.) 6.5%
   B.) 2.3%
   C.) 5.5%
   D.) 4.6%

Answer: Option 'D'

4.6%

3.

1990 నుంచి భారతదేశం తన దారిద్య్ర రేటును సగానికి తగ్గించి, గత 15 ఏళ్లలో 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును సాధించిందని  ఏ సంస్థ పేర్కొంది?

   A.) ప్రపంచ వాణిజ్య సంస్థ
   B.) ఆసియా అభివృద్ధి బ్యాంకు
   C.) అంతర్జాతీయ ద్రవ్యనిధి
   D.) ప్రపంచ బ్యాంకు

Answer: Option 'D'

ప్రపంచ బ్యాంకు

4.

ప్రపంచంలోని మొదటి కృత్రిమ మేథస్సు యూనివర్సిటీ ‘మొహమ్మద్‌ బిన్‌ జావిద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఎమ్‌బిజెడ్‌యూఏఐ)’ను ఎక్కడ  స్థాపించారు?

   A.) సౌదీ అరేబియా
   B.) యూఏఈ
   C.) టర్కీ
   D.) ఒమన్‌

Answer: Option 'B'

యూఏఈ

5.

2019 అక్టోబర్‌ 16న ఎవరిని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ)గా నియమించారు?

   A.) సందీప్‌ మిశ్రా
   B.) హరీష్‌ శర్మ
   C.) జితేంద్ర పాల్‌ సింగ్‌ చావ్లా
   D.) సంతోష్‌ సిన్హా

Answer: Option 'C'

జితేంద్ర పాల్‌ సింగ్‌ చావ్లా

6.

అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెందిన ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్‌ నివేదిక ప్రకారం 2019 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి ఎంత?

   A.) 6.1%
   B.) 6.3% 
   C.) 7.0%
   D.) 6.5%

Answer: Option 'A'

6.1%

7.

పశ్చిమ బెంగాల్‌లోని పనగర్‌ పట్టణంలో అర్జన్‌ సింగ్‌ ప్రారంభించిన ఇండో–జపాన్‌ సంయుక్త వాయుదళ వ్యాయామం పేరేమిటి?

   A.) సియామ్‌ భారత్‌
   B.) షిన్యూ మైత్రి
   C.) ఎడారి డేగ
   D.) తూర్పు వంతెన

Answer: Option 'B'

షిన్యూ మైత్రి

8.

కన్సర్న్‌ వరల్డ్‌వైడ్, వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌లు సంయుక్తంగా విడుదల చేసిన 2019–ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)లో భారత దేశ స్థానం ఎంత?

   A.) 102 
   B.) 105 
   C.) 110
   D.) 104

Answer: Option 'A'

102 

9.

నీతిఆయోగ్‌ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌(III)లో అత్యంత వినూత్న రాష్ట్రంగా ర్యాంకు పొందిన స్టేట్‌ ఏది?

   A.) కర్నాటక
   B.) తమిళనాడు
   C.) మహారాష్ట్ర
   D.) ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'A'

కర్నాటక

10.

ఇండో–బంగ్లా బౌల్‌ సంగీతం పండుగ–2019 ఎక్కడ జరిగింది?

   A.) ఢాకా, బంగ్లాదేశ్‌
   B.) చిట్టగ్యాంగ్, బంగ్లాదేశ్‌
   C.) ముంబై, ఇండియా
   D.) న్యూఢిల్లీ, ఇండియా

Answer: Option 'A'

ఢాకా, బంగ్లాదేశ్‌


కరెంటు అఫైర్స్ - 18 November - 2019 Download Pdf

Recent Posts