కరెంటు అఫైర్స్ - 27 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ గురించి కింది వాటిలో సరైనవి?
 1. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 44 ప్రకారం దేశమంతటా యూసీసీ అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు.
 2. 2018లో లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వారు యూసీసీ అవసరమా కాదా అని సంప్రదింపులు జరిపారు.
 3. గోవా ఒక్క రాష్ట్రంలోనే యూసీసీని అమలు చేస్తున్నారు.

   A.) 1, 2, 3
   B.) 1, 2
   C.) 2, 3
   D.) 1, 2

Answer: Option 'A'

1, 2, 3

2.

కింది వాటిలో దేనిని దక్షిణాసియాలోనే మొదటి క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్‌ అని పిలుస్తారు?

   A.) చబ్బార్‌ పోర్టు పైప్‌లైన్‌
   B.) మోతీహరి–అమ్లేఖ్‌గంజీ పైప్‌లైన్‌
   C.) 1, 2
   D.) హిమాలయన్‌ పెట్రోలియం పైప్‌లైన్‌

Answer: Option 'B'

మోతీహరి–అమ్లేఖ్‌గంజీ పైప్‌లైన్‌

3.

ఇటీవల వార్తల్లో నిలిచిన అగ్నిఅస్త్ర,  బ్రహ్మాస్త్ర, నీమాస్త్ర అనేవి ఏ రంగానికి చెందినవి?

   A.) రక్షణ రంగం
   B.) బయోటెక్నాలజీ
   C.) సున్నా ఆధారిత వ్యవసాయం
   D.) పైవన్నీ

Answer: Option 'C'

సున్నా ఆధారిత వ్యవసాయం

4.

మేఘాలయ హైకోర్టుకు బదిలీ అయిన తరువాత రాజీనామా చేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు?

   A.) విజయ కమలేష్‌ తాహిల్‌రమణి
   B.) గీతా మిట్టల్‌
   C.) ఇందిరా బెనర్జీ
   D.) మంజులా చెల్లూర్‌

Answer: Option 'A'

విజయ కమలేష్‌ తాహిల్‌రమణి

5.

ములగంధ కుటి విహార్‌లో గౌతమబుద్ధుడు ఏం చేశాడు?
 1. మొదటి ధర్మ సంభాషణ చేశాడు
 2. సారనాథ్‌ను సందర్శించేటప్పుడు అక్కడ నివసించాడు.

   A.) 1 మాత్రమే
   B.) 2 మాత్రమే
   C.) 1, 2
   D.) 1 లేదా 2

Answer: Option 'B'

2 మాత్రమే

కరెంటు అఫైర్స్ - 27 September- 2019 Download Pdf

Recent Posts