కరెంటు అఫైర్స్ - January 30th - 31th - 2020 - AP Grama Sachivalayam

1.

ప్రభుత్వ సేవలు, బీమా, సరఫరాల నిర్వహణ కోసం 3 బ్లాక్‌ చెయిన్‌ పవర్‌ అప్లికేషన్స్‌ను ఏ సంస్థ ప్రారంభించింది?

   A.) కాగ్నిజెంట్‌
   B.) ఇన్ఫోసిస్‌
   C.) విప్రో
   D.) టీసీఎస్‌

Answer: Option 'B'

ఇన్ఫోసిస్‌

2.

యూఎస్‌ఏకు చెందిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన భారతీయ అమెరికన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఎవరు?

   A.) రాజ్‌ రెడ్డి
   B.) మధుసూదన్‌
   C.) శంకర్‌ కుమార్‌ పాల్‌
   D.) సేతురామన్‌ పంచనాథన్‌

Answer: Option 'D'

సేతురామన్‌ పంచనాథన్‌

3.

‘బిగ్‌ స్టేట్‌ కేటగిరి’లో తొలి ఎడిషన్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సూచీలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) కర్ణాటక
   C.) మహారాష్ట్ర
   D.) తమిళనాడు

Answer: Option 'D'

తమిళనాడు

4.

హిమాచల్‌ప్రదేశ్‌ రోహతంగ్‌ మార్గంలో నిర్మితమైన ప్రపంచంలోనే పొడవైన పర్వత సొరంగం అటల్‌ టన్నెల్‌ పొడవు ఎంత?

   A.) 9.8 కిలోమీటర్లు
   B.) 9.2 కిలోమీటర్లు
   C.) 8.8 కిలోమీటర్లు
   D.) 10.2 కిలోమీటర్లు

Answer: Option 'C'

8.8 కిలోమీటర్లు

5.

2019లో అత్యధికంగా అంతర్జాతీయ పరుగులు,  సిక్స్‌లు కొట్టి తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టిన భారతీయ క్రికెటర్‌ ఎవరు?

   A.) విరాట్‌ కొహ్లీ
   B.) శిఖర్‌ ధావన్‌
   C.) ఎం.ఎస్‌. ధోనీ
   D.) రోహిత్‌ శర్మ

Answer: Option 'D'

రోహిత్‌ శర్మ

6.

భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరచేందుకు ప్రధాని నరేంద్రమోదీ 5 సంవత్సరాలకుగాను రూ.6వేల కోట్ల వ్యయంతో  ప్రారంభించిన పథకం ఏది?

   A.) అటల్‌ భూజల్‌ యోజన
   B.) అటల్‌ విద్యుదీకరణ్‌ యోజన
   C.) అటల్‌ సమృద్ధి యోజన
   D.) అటల్‌ జల్‌ యోజన

Answer: Option 'A'

అటల్‌ భూజల్‌ యోజన

7.

నీటి పారిశుధ్యం పరిశుభ్రత విభాగంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు యూనిసెఫ్‌ ఏ జిల్లాకు బహుమతిని ప్రదానం చేసింది?

   A.) కామారెడ్డి జిల్లా, తెలంగాణ
   B.) గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
   C.) వయనాడ్, కేరళ
   D.) నాగపట్నం జిల్లా, తమిళనాడు

Answer: Option 'A'

కామారెడ్డి జిల్లా, తెలంగాణ

8.

ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ. 24 వేలు అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ప్రారంభించిన పథకం ఏది?

   A.) వైఎస్సార్‌ యువ కిరణాలు
   B.) వైఎస్సార్‌ నేతన్న నేస్తం
   C.) వైఎస్సార్‌ ఆసరా
   D.) వైఎస్సార్‌ భరోసా

Answer: Option 'B'

వైఎస్సార్‌ నేతన్న నేస్తం

9.

ఇటీవల భారత ఫార్మాకోపియా గుర్తింపు పొందిన తొలి దేశం ఏది?

   A.) ఆఫ్ఘనిస్తాన్‌
   B.) ఇరాక్‌
   C.) సిరియా
   D.) ఇజ్రాయేల్‌

Answer: Option 'A'

ఆఫ్ఘనిస్తాన్‌

10.

ఐఐటీ హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గేట్స్‌ ఫౌండేషన్‌ సహాకారంతో ప్రారంభించిన భారత తొలి ‘వ్యాక్సినేషన్‌ ఆన్‌ వీల్స్‌’ క్లినిక్‌ ఎక్కడ ఉంది?

   A.) గువాహటి, అసోం
   B.) పుణే, మహారాష్ట్ర  
   C.) కోల్‌కత, పశ్చిమబంగా
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'B'

పుణే, మహారాష్ట్ర  

11.

పాఠశాలల్లో ఫిట్‌ ఇండియా వీక్‌ నిర్వహించిన జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఆంధ్రప్రదేశ్
   B.) ఉత్తర ప్రదేశ్‌
   C.) కేరళ 
   D.) కర్ణాటక

Answer: Option 'A'

ఆంధ్రప్రదేశ్

12.

ఎనిమిది పశ్చిమాఫ్రికా దేశాలు (బెనిన్, బుర్కినా ఫాసో, గినియా – బిస్సా, ఐవరీ కోస్ట్, మాలీ, నైజర్, సెనెగల్, టోగో) ఇటీవల ‘సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌ ’గా పేరు మార్చిన కరెన్సీ సాధారణ పేరు ఏమిటి?

   A.) ఎసో
   B.) ఎకో
   C.) ఎరి
   D.) యూరో

Answer: Option 'B'

ఎకో

13.

2019 డిసెంబర్‌ 24న పాటించిన∙వినియోగదారుల హక్కుల దినోత్సవం నేపథ్యం ఏమిటి?

   A.) ‘అల్టర్‌నేట్‌ కన్జూమర్‌ గ్రీవెన్స్‌/ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌’
   B.) ‘టై మ్లీ్ల డిస్సోసల్‌ ఆఫ్‌ కన్జూమర్‌ కంప్లైంట్స్‌’
   C.) ‘యాంటిబయోటిక్స్‌ ఆఫ్‌ ద మెనూ’
   D.) ‘బిల్డింగ్‌ ఎ డిజిటల్‌ వరల్డ్‌ కన్స్యూమర్ కెన్‌ ట్రస్ట్‌’

Answer: Option 'A'

‘అల్టర్‌నేట్‌ కన్జూమర్‌ గ్రీవెన్స్‌/ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌’

14.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రాంతీయ కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం ‘స్వచ్ఛ సముంద్ర ఎన్‌ డబ్య్లు–2019’ ఎక్కడ జరిగింది?

   A.) గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, గుజరాత్‌
   B.) మలబార్‌ కోస్ట్, కేరళ
   C.) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, తమిళనాడు
   D.) గల్ఫ్‌ ఆఫ్‌ కంభట్, గుజరాత్‌

Answer: Option 'A'

గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, గుజరాత్‌

15.

2019 డిసెంబర్‌ 20న తెలంగాణ మొదటి లోకాయుక్తగా ఎవరు నియమితులైయ్యారు?

   A.) లక్ష్మణ్‌ రెడ్డి
   B.) సి.వి. రాములు
   C.) రేవా ఖేత్రపాల్‌ 
   D.) నవాల్‌ కిషోర్‌ అగర్వాల్‌

Answer: Option 'B'

సి.వి. రాములు

16.

అమెరికా అత్యంత శక్తిమంతమైన ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా మొదటిసారి నియమితులైన మహిళ ఎవరు ?

   A.) ఏంజెలా అహ్రెండ్ట్స్‌
   B.) డా. మోనిషా ఘోష్‌
   C.) ఉర్సుల బర్న్స్‌
   D.) షెరిల్‌ శాండ్‌బర్గ్‌

Answer: Option 'B'

డా. మోనిషా ఘోష్‌
 

17.

మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా  నిలిపి ఉంచేందుకు ‘గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి’ తొలి ఎడిషన్‌ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం ఏది?

   A.) ఇటలీ
   B.) ఫ్రాన్స్‌
   C.) స్పెయిన్‌
   D.) పోర్చుగల్‌

Answer: Option 'D'

పోర్చుగల్‌

18.

ఇటీవల పరీక్షించిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణి సామర్థ్యం ఎంత?

   A.) 70–80 కిలోమీటర్లు
   B.) 50–60 కిలోమీటర్లు
   C.) 35–40 కిలోమీటర్లు
   D.) 25–30 కిలోమీటర్లు

Answer: Option 'D'

25–30 కిలోమీటర్లు

19.

అసోచాంకు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు?

   A.) బాలకృష్ణ గోయాంక
   B.) వినీత్‌ అగర్వాల్‌
   C.) నిరంజన్‌ హిరనందనీ
   D.) చంద్రు రహేజా

Answer: Option 'C'

నిరంజన్‌ హిరనందనీ

20.

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ఏ నిధి కింద రూ. 7వేల కోట్లను మంజూరు చేసింది?

   A.) స్వధార్‌ గ్రహ్‌ ఫండ్‌
   B.) మహిళా ఈ హాత్‌ ఫండ్‌
   C.) నిర్భయ ఫండ్‌
   D.) దిశా ఫండ్‌

Answer: Option 'C'

నిర్భయ ఫండ్‌


కరెంటు అఫైర్స్ - January 30th - 31th - 2020 Download Pdf

Recent Posts