కరెంటు అఫైర్స్ - February 9th - 11th - 2020 - AP Grama Sachivalayam

1.

32 వ ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్న సినిమా ఏది?

   A.) జోకర్
   B.) 1917
   C.) పారసైట్
   D.) మ్యారేజ్ స్టోరీ 

Answer: Option 'C'

పారసైట్

92 వ ఆస్కార్ పురస్కార వేడుకలు అమెరికా లోని లాస్ ఏంజిల్స్ నగరంలోని డాల్బీ ధియేటర్ లో 2020 జనవరి 9 న జరిగాయి. దక్షిణ కొరియా చిత్రం పారసైట్ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు సొంతం చేసుకొన్న ఆంగ్లేతర చిత్రంగా చరిత్ర సృష్టించింది. మొత్తం నాలుగు అవార్డులు అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. పారసైట్ చిత్రాన్ని తెరకెక్కించిన బాంగ్ జూన్ హూ ఉత్తాన దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే జోకర్ లో ప్రధాన పాత్ర పోషించిన జాక్వీన్ ఫీనిక్స్  ఉత్తమ నాటుసాగా ఆస్కార్ అవార్డు దక్కించుకున్నారు. జూడి చిత్రానికిగాను రెనీ జెల్ వెగర్ ఉత్తమ నటి ఆస్కార్ గెలుచుకుంది.

2.

రోహింగ్యాల మారణకాండపై అంతర్జాతీయ న్యాయస్థానం లో కేసు వేసిన దేశం ఏది?

   A.) ఈజిప్టు
   B.) గాంబియా
   C.) టునీసియా
   D.) సౌదీ అరేబియా

Answer: Option 'B'

గాంబియా

3.

2020 జనవరి లో క్రాస్ వరల్డ్ బుక్ అవార్డు (జ్యురీ కేటగిరి) ను గెలుచుకున్న రచయిత్రి ఎవరు?

   A.) నమితా గోఖలే 
   B.) అనురాధా రాయ్ 
   C.) మాధురీ విజయ్ 
   D.) అరుంధతీ రాయ్      

Answer: Option 'C'

మాధురీ విజయ్ 

బెంగళూరు జన్మించి ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న రచయిత్రి మాధురీ విజయ్ కు ప్రతిష్ట్మాక క్రాస్ వరల్డ్ బుక్ అవార్డు (జ్యురీ కేటగిరీ) 2020 జనవరిలో లభించింది. ఆమె రచించిన 'ది ఫార్ ఫీల్డ్' అనే పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. కాశ్మీర్ లోయలోని పరిస్థితులను ఈ నవల వివరిస్తుంది. ఈ అవార్డు కింద ఆమెకు మూడు లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. సలీమాన్ రాష్డీ, విక్రమ్ సేథ్, కిరణ్ దేశాయ్ వంటి ప్రఖ్యాత భారతీయులు గతంలో క్రాస్ వరల్డ్ బుక్ అవార్డు ను గెలుచుకున్నారు. 'ది ఫర్ ఫీల్డ్' పుస్తకానికి మాధురీ విజయ్ ఇటీవల జేసీబీ ఫ్రాయిజ్ ఫర్ లిటరేచర్, టాటా లిటరేచర్ లైవ్ ఫస్ట్ బుక్ అవార్డులను కూడా గెలుచుకోవడం విశేషం.

4.

2019 సంవత్సరానికిగాను సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?

   A.) గోవింద మిశ్రా 
   B.) ఎస్.ఎల్. బైరప్ప 
   C.) మనోజ్ దాస్ 
   D.) వాసుదేవ్ మోహి     

Answer: Option 'D'

వాసుదేవ్ మోహి     

ప్రముఖ సింధీ రచయిత వాసుదేవ్ మోహి 2019 వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. 'చెక్ బుక్' అనే చిన్న కధల పుస్తకానికి ఈ అవార్డును 2020 జనవరిలో ప్రకటించారు. 'చెక్ బుక్' 2012 లో ప్రచురితమైనది. వాసుదేవ్ మోహి సింధీ భాషలో కవితలు, కథలు, అనువాదాలు కలిపి 25 రచనలు చేశారు. లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ నాయకత్వంలోని లమీతి వాసుదేవ్ మోహిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని 1991 లో ప్రారంభించారు. దీన్ని కె.కె. బిర్లా ఫౌండేషన్ ప్రతి ఏటా అందజేస్తారు. భారత రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్ లో వున్నా 22 భాషల్లో ప్రతిభావంతులైన రచయితలకు అందజేస్తారు. 2018 కి గాను ఈ అవార్డును మొట్టమొదటిసారి ఒక తెలుగు రచయితకు ప్రధానం చేశారు. 'పక్కకి ఒత్తిగిలితే' అనే కవితా సంపుటికిగాను కె.శివారెడ్డికి 2018 లో ఈ అవార్డు లభించేంచింది.
 

5.

అమెరికాలో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

   A.) సయ్యద్ అక్బరుద్దీన్ 
   B.) తరుణ్ జీత్ సింగ్ సంధు
   C.) విజయ్ కేశవ్ గోఖలే 
   D.) రవీష్ కుమార్

Answer: Option 'B'

తరుణ్ జీత్ సింగ్ సంధు

1988 వ బ్యాచ్ ఇండియన్ ఫారీన్ సర్వీస్ (ఐ ఎఫ్ ఎస్) అధికారి తరం జీత్ సింగ్ సంధు అమెరికాలో భారత రాయబారిగా 2020 జనవరి 28 న నియమితులయ్యారు. ఈ నియమాకం నాటికి ఆయన శ్రీలంకలో భారత హైకమిషనర్ గా ఉన్నారు. హర్షవర్ధన్ ష్రింగ్ల స్థానంలో తరుణ్ జీత్ సింగ్ సంధు అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు. హర్ష వర్ధన్ 2020 జనవరి 29 న విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.    


కరెంటు అఫైర్స్ - February 9th - 11th - 2020 Download Pdf

Recent Posts